TTD HONOURS EMPLOYEES WITH SPECIAL NEEDS _ ప్రత్యేక ప్రతిభావంతులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి : టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు

Text content

BUILD SKILLS AND MOVE FORWARD WITH CONFIDENCE: TTD DY EO SRI ANANDA RAJU

Tirupati, September 26, 2026: TTD Welfare Department Dy. EO Sri Ananda Raju urged persons with special needs to develop their skills, build confidence and excel in all fields.

World Day of the Deaf and International Day of Sign Languages were observed at the TTD Administrative Building premises on Saturday.

Five TTD employees with special needs who excelled in their duties were honoured with certificates of appreciation. A rally was also held, and A–Z sign language posters were unveiled.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

ప్రత్యేక ప్రతిభావంతులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి : టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఐదుగురు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలతో సత్కారం

తిరుపతి, 2026 సెప్టెంబరు 26: ప్రత్యేక ప్రతిభావంతులు తమలోని ప్రతిభను గుర్తించి, నైపుణ్యాలను మరింతగా పెంపొందించుకుని ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించాలని టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు కోరారు.

తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలోని పాత అన్నప్రసాద భవనంలో శనివారం ప్రపంచ బధిరుల దినోత్సవం, అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ ఆనందరాజు మాట్లాడుతూ, ప్రత్యేక ప్రతిభావంతులకు సమాజంలో సముచిత గౌరవం, అవకాశాలు కల్పించేందుకు టీటీడీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తమ ప్రతిభను సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని సూచించారు. టీటీడీ యాజమాన్యం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.

ఎస్వీ బధిరుల ఉన్నత పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ గంగాధర్ మాట్లాడుతూ, ప్రత్యేక ప్రతిభావంతులు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో తమ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్య, ఉద్యోగం, క్రీడలు, కళలు తదితర రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.

ఐదుగురు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలతో సత్కారం

అనంతరం విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన ఐదుగురు ప్రత్యేక ప్రతిభావంతులైన టీటీడీ ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. సంకేత భాష A–Z పోస్టర్లను ఆవిష్కరించారు.

అంతకుముందు టీటీడీ పరిపాలనా భవనం ప్రధాన ద్వారం నుంచి సమావేశ మందిరం వరకు ప్రత్యేక ప్రతిభావంతులు ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీ మహేష్, టీటీడీ హియరింగ్ హ్యాండీక్యాప్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ సునీల్ కుమార్, స్టేట్ అడ్వైజర్ శ్రీ లక్ష్మీనరసింహులు, టీటీడీలో విధులు నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రతిభావంతులైన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది