PAVITROTSAVAMS CONCLUDE AT DEVUNI KADAPA TEMPLE _ దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
Tirupati/Kadapa, September 26, 2026: The three-day Pavitrotsavams at Sri Lakshmi Venkateswara Swamy Temple, Devuni Kadapa, concluded on Saturday with Maha Poornahuthi.
The final-day rituals included Maha Poornahuthi, Pavitra Vitarana and Kumbha Prokshanam, performed as per Agama traditions.
A Tiruveedhi Utsavam was also held in the evening. Devotional music, Harikatha and Bhajans were presented under the auspices of TTD’s Hindu Dharma Prachara Parishad, Annamacharya Project and Dasa Sahitya Project.
Temple Deputy EO Smt. Prashanthi, AEO Sri Ravi, Temple Inspector Sri Eswar Reddy, priests and devotees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
తిరుపతి / కడప, 2026 సెప్టెంబరు 26: దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు శనివారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మహాపూర్ణాహుతి, పవిత్ర వితరణ, కుంభ ప్రోక్షణ నిర్వహించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరువీధి ఉత్సవం జరగనుంది. సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, ఏఈఓ శ్రీ రవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి, ఆలయ అర్చకులు, విశేస సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




