Rs.5.73 CRORE DEVELOPMENT WORKS AT VALMIKIPURAM SRI PATTABHI RAMA SWAMY TEMPLE _ వాల్మీకిపురం శ్రీ పట్టాభి రామస్వామి ఆలయ అభివృద్ధికి రూ.5.73 కోట్లు
TTD CHAIRMAN SRI B.R.NAIDU LAYS FOUNDATION STONE
Valmikipuram, September 28, 2026: TTD Chairman Sri B.R. Naidu on Monday laid the foundation stone for various development works worth Rs.5.73 crore at Sri Pattabhi Rama Swamy Temple in Valmikipuram, Annamayya district.
Speaking on the occasion, the Chairman said TTD is giving priority to the renovation of ancient temples and construction of new temples as part of promoting Sanatana Dharma at the grassroots level, as directed by Chief Minister Sri N. Chandrababu Naidu. As part of the target to construct 5,000 temples, works have already commenced for 1,200 temples, he said.
He said funds were sanctioned for the development of the temple following the request of Pileru MLA Sri Nallari Kishore Kumar Reddy.
Major Development Works:
Pushkarini development – Rs.1.12 crore
Kalyana Vedika Mandapam – Rs.73 lakh
Reconstruction of southern Rajagopuram – Rs.52 lakh
Entrance arch – Rs.30 lakh
Second floor of Kalyana Mandapam – Rs.1.80 crore
Renovation of Paruveta Mandapam – Rs.1.26 crore
The TTD Chairman was accorded a Poornakumbha welcome by the priests. He had darshan of Sri Pattabhi Rama Swamy, received Vedic blessings and performed special prayers. Later, he unveiled the foundation stone for the development works.
Pileru MLA Sri Nallari Kishore Kumar Reddy, TTD JEO Dr. A. Sarat, Board members Sri G. Bhanu Prakash Reddy, Sri Shantaram, Smt. Panabaka Lakshmi and Sri Naresh Kumar, Ex-officio Member Sri Dollar Divakar Reddy, CE Sri Manoharam, Special Grade DyEO Smt. P. Varalakshmi, EE Sri Mallikarjuna Prasad, AEO Sri Gopinath, officials, staff and priests participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
వాల్మీకిపురం శ్రీ పట్టాభి రామస్వామి ఆలయ అభివృద్ధికి రూ.5.73 కోట్లు
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు
వాల్మీకిపురం, సెప్టెంబరు 28, 2026: అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభి రామస్వామివారి ఆలయాన్ని మరింత ఆధ్యాత్మిక వైభవంతో అభివృద్ధి చేసేందుకు రూ.5.73 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు సనాతన ధర్మాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో భాగంగా పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణానికి టీటీడీ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 5 వేల ఆలయాల నిర్మాణ లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 1,200 ఆలయాల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభి రామస్వామివారి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
ప్రధాన అభివృద్ధి పనులు
పుష్కరిణి అభివృద్ధి – రూ.1.12 కోట్లు
కళ్యాణ వేదిక మండప నిర్మాణం – రూ.73 లక్షలు
దక్షిణ వైపు రాజగోపురం పునర్నిర్మాణం – రూ.52 లక్షలు
ఆలయ ప్రవేశ ఆర్చ్ నిర్మాణం – రూ.30 లక్షలు
కళ్యాణ మండపం రెండో అంతస్తు నిర్మాణం – రూ.1.80 కోట్లు
పార్వేట మండపం పునర్నిర్మాణం – రూ.1.26 కోట్లు
కాగా, ఆలయానికి చేరుకున్న టీటీడీ చైర్మన్‌కు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని వేదాశీర్వచనం పొందారు. ఆలయ విమాన ప్రాకారాన్ని ప్రదక్షిణ చేసిన అనంతరం శ్రీరాములవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పీలేరు ఎమ్మెల్యే శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, బోర్డు సభ్యులు శ్రీ జి. భానుప్రకాశ్ రెడ్డి, శ్రీ శాంతారాం, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ నరేష్ కుమార్, ఎక్స్ అఫిషియో మెంబర్ శ్రీ డాలర్ దివాకర్ రెడ్డి, సీఈ శ్రీ మనోహరం, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి పి. వరలక్ష్మి, ఈఈ శ్రీ మల్లికార్జున ప్రసాద్, ఏఈవో శ్రీ గోపినాథ్, అధికారులు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.







