SERVE DEVOTEES WITH DEDICATION INSPIRED BY MAHATMA GANDHI _ గాంధీజీ స్ఫూర్తితో భక్తులకు అంకితభావంతో సేవలందించాలి

GIVE GREATER PRIORITY TO CLEANLINESS AND HYGIENE: TTD JEO SRI PRABHALA GOPINATH

Tirupati, October 2, 2026: TTD employees should work with honesty, discipline and dedication, inspired by Mahatma Gandhi, and provide better facilities to devotees visiting Tirumala for Srivari Darshan, said TTD JEO (Health and Education) Sri Prabhala Gopinath.

Gandhi Jayanti was celebrated at the TTD Administrative Building in Tirupati on Friday. The JEO paid floral tributes to Mahatma Gandhi.

Speaking on the occasion, he said that working in TTD, a sacred institution visited by millions of devotees from across the world, was a privilege and an opportunity to serve. He urged every employee to serve devotees with a sense of responsibility and humanity. He stressed that maintaining cleanliness and hygiene was everyone’s collective responsibility.

He recalled that Mahatma Gandhi united people through truth and non-violence during the freedom struggle and worked for social equality and the welfare of all sections of society. He called upon everyone to follow Gandhi’s ideals in their daily lives.

TTD Welfare Deputy EO Sri Anandaraju, Tirupati Estate Officer Smt. Suvarnamma, Tirumala Estate Officer Sri Venkateswarlu, CAO Sri Venkataramana, SVETA In-charge Director Dr. Vema Venkata Ratnam, other officials, employees’ union representatives and staff participated in the programme.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICE

గాంధీజీ స్ఫూర్తితో భక్తులకు అంకితభావంతో సేవలందించాలి

స్వచ్ఛత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: టీటీడీ జేఈవో శ్రీ ప్రభల గోపీనాథ్

తిరుపతి, 2026 అక్టోబరు 02: జాతిపిత మహాత్మా గాంధీజీ స్ఫూర్తితో టీటీడీ ఉద్యోగులు మరింత నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టీటీడీ జేఈవో (వైద్యం, విద్య) శ్రీ ప్రభల గోపీనాథ్ కోరారు. స్వచ్ఛత, పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈవో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు విశ్వాసంతో శ్రీవారి దర్శనానికి వచ్చే పవిత్రమైన టీటీడీలో పనిచేయడం మన అదృష్టమని, సేవా భాగ్యమని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి మానవతా దృక్పథంతో భక్తులకు సేవలందించాలని సూచించారు. పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి సామూహిక బాధ్యత అని స్పష్టం చేశారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో సత్యం, అహింస మార్గాల ద్వారా ప్రజలను ఏకం చేసిన గాంధీజీ, సామాజిక అసమానతల నిర్మూలనకు, అన్ని వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని తెలిపారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు, తిరుపతి ఎస్టేట్ ఆఫీసర్ శ్రీమతి సువర్ణమ్మ, తిరుమల ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ వేంకటేశ్వర్లు, సీఏవో శ్రీ వేంకటరమణ, శ్వేత ఇన్‌చార్జి సంచాలకులు డా. వేమా వెంకట రత్నం, ఇతర అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.