SPECIAL FOCUS ON ARRANGEMENTS FOR SRIVARI NAVARATRI BRAHMOTSAVAMS _ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి 

SPECIAL COORDINATION CENTRE TO BE SET UP IN TIRUPATI: TTD JEO DR A. SHARATH

Tirupati, October 2, 2026: With the Srivari Navaratri Brahmotsavams scheduled from October 12 to 20, TTD JEO Dr. A. Sharath directed officials to complete all arrangements in a coordinated manner to ensure a smooth and comfortable experience for devotees in Tirupati.

The JEO, along with TTD JEO (Health and Education) Sri Prabhala Gopinath, conducted a virtual review meeting with officials of various departments on Friday morning.

The JEO directed officials to provide attractive illumination and LED screens at key locations in Tirupati. Drinking water, toilets and information flex boards should be arranged at parking areas and holding points. Proper signages and public announcements should also be provided for the convenience of devotees.

He instructed officials to set up a special Coordination Centre in Tirupati for inter-departmental coordination and to monitor the arrangements on a daily basis.

He also directed officials to set up attractive welcome arches at the four major entry points to Tirupati to create a spiritual atmosphere for devotees. Special attention should be given to cleanliness along major roads and areas frequented by devotees.

CE Sri Manoharam, SE Sri Venkateswarlu, VGO Sri Giridhar, Dy.EO Sri Selvam, TTD Transport GM Sri Ramu, CMO Smt. Kusuma Kumari, DEs Sri Ravishankar Reddy and Sri Saraswathi, EE Sri Mallikarjuna Prasad, Additional Health Officer Dr. Sunil Kumar and others participated in the virtual review meeting.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి 

తిరుపతిలో సమన్వయం కోసం ప్రత్యేక కోఆర్డినేషన్ సెంటర్ : టిటిడి జేఈవో డా. ఎ. శరత్

తిరుపతి, 2026 అక్టోబర్ 02: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుండి 20వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో తిరుపతిలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని టిటిడి జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు.  తిరుపతి జేఈవో (వైద్యం, విద్య) శ్రీ ప్రభల గోపినాథ్‌తో కలిసి శుక్రవారం ఉదయం పలు శాఖల అధికారులతో వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలోని ప్రధాన ప్రాంతాల్లో ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పార్కింగ్ ప్రాంతాలు, హోల్డింగ్ పాయింట్ల వద్ద భక్తులకు అవసరమైన త్రాగునీరు, మరుగుదొడ్లు, సమాచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు అవసరమైన సమాచారం స్పష్టంగా అందేలా సూచికలు, ప్రకటనలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసేందుకు ప్రత్యేక కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేసి, రోజువారీగా ఏర్పాట్లను పర్యవేక్షించాలని జేఈవో సూచించారు. 

తిరుపతికి కలిసే నాలుగు ప్రధాన కూడళ్ల వద్ద మరింత ఆకర్షిణీయంగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాలని తెలిపారు. ప్రధాన రహదారులు, భక్తుల రాకపోకలు ఉండే ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

ఈ వర్చువల్ సమీక్షలో సీఈ శ్రీ మనోహరం, ఎస్‌ఈ శ్రీ వేంకటేశ్వర్లు, వీజీవో శ్రీ గిరిధర, డిప్యూటీ ఈవో శ్రీ సెల్వం, టిటిడి ట్రాన్స్‌పోర్ట్ జీఎం శ్రీ రాము, సీఎంవో శ్రీమతి కుసుమ కుమారి, డీఈలు శ్రీ రవిశంకర్ రెడ్డి, శ్రీ సరస్వతి, ఈఈ శ్రీ మల్లికార్జున ప్రసాద్, అదనపు హెల్త్ ఆఫీసర్ డా. సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.