CONDUCT NAVARATRI BRAHMOTSAVAMS WITH GRANDEUR – ADDNL. EO _ నవరాత్రి బ్రహ్మోత్సవాలను గొప్పగా నిర్వహించాలి
TIRUMALA, 09 OCTOBER 2026: The TTD Additional EO Sri Venkaiah Chowdary called upon the deputed officials and employees of TTD to work in coordination towards the successful conduct the Srivari Navaratri Brahmotsavams on a grand note, akin to Srivari Salakatla Brahmotsavams held last month.
Addressing employees deputed for Brahmotsavam duties at Asthana Mandapam in Tirumala on Friday evening, he said the success of the Salakatla Brahmotsavams was the result of everyone’s efforts.
JEOs Dr Sharath, Sri Gopinath, CVSO Sri Murali Krishna and officials from various departments, Group supervisors from Srivari Seva attended the meeting.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
నవరాత్రి బ్రహ్మోత్సవాలను గొప్పగా నిర్వహించాలి
–డెప్యుటేషన్ ఉద్యోగుల సమావేశంలో టిటిడి అదనపు ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి
తిరుమల, 2026 అక్టోబరు 09: సెప్టెంబరులో జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అధికారుల సమన్వయంతో విజయవంతం అయ్యాయని, ఇదే స్ఫూర్తితో నవరాత్రి బ్రహ్మోత్సవాలను గొప్పగా నిర్వహించాలని టిటిడి అదనపు ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి కోరారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో విధులు కేటాయించిన టిటిడి ఉద్యోగులకు శుక్రవారం సాయంత్రం తిరుమల ఆస్థాన మండపంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను చక్కటి సమన్వయంతో నిర్వహించామని, ఈ విజయం ఉద్యోగుల అందరిదని చెప్పారు.
జెఈవో డాక్టర్ శరత్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది కలిసి టీమ్ వర్క్ గా పని చేయడం వల్ల గత బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని, ఇదే స్ఫూర్తితో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల భద్రత చాలా కీలకమైన అంశమని, కావున మాడవీధుల్లో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ భద్రతాధికారుల సూచనలను తప్పక పాటించాలని కోరారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ వెళ్లేందుకు వీలుగా గేట్లను తెరిచి ఉంచడానికి ఉద్యోగులు, శ్రీవారి సేవకులు సహకరించాలన్నారు.
ఈ సమావేశంలో జెఈవో(విద్య, వైద్యం) శ్రీ గోపీనాథ్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.





