491 ARTISTES FROM 17 TROUPES ACROSS 10 STATES ADD COLOUR TO SIMHA VAHANA SEVA _ సింహ వాహనసేవలో ఆధ్యాత్మిక శోభ.. భక్తిభావాన్ని చాటిన కళారూపాలు
Tirumala, 14 October 2026: As part of the ongoing Srivari Salakatla Brahmotsavams, the Simha Vahana Seva was celebrated with great devotion and grandeur on Wednesday morning.
Cultural teams hailing from 10 States, comprising 17 troupes and 491 artistes, presented a captivating blend of classical and folk art forms along the four Mada streets.
The performances included Bharatanatyam, Kuchipudi, Ghoomar, Yog Chaap, drum displays, Kangi, Halakki Suggi Kunitha, Dogri dance, Kalbelia, Annamayya Padaavali dance ballet and Kolatam.
The colourful performances added spiritual splendour to the Simha Vahana Seva and enthralled the devotees.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
సింహ వాహనసేవలో ఆధ్యాత్మిక శోభ.. భక్తిభావాన్ని చాటిన కళారూపాలు
10 రాష్ట్రాల నుంచి 17 కళాబృందాలు.. 491 మంది కళాకారుల ప్రదర్శనలు
తిరుమల, 2026 అక్టోబరు 14: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారి సింహ వాహనసేవలో దేశం నలుమూలల నుంచి విచ్చేసిన కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తి, సంగీతం, నృత్యం, భారతీయ సంస్కృతీ సంప్రదాయాల సమ్మేళనంతో తిరుమాడ వీధులు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని సంతరించుకున్నాయి.
వివిధ రాష్ట్రాల కళారూపాలతో సాంస్కృతిక వైభవం
సింహ వాహనసేవలో 10 రాష్ట్రాలకు చెందిన 17 కళాబృందాల నుంచి 491 మంది కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో భక్తులను అలరించారు. భరతనాట్యం, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాలతో పాటు ఘూమర్, కల్బేలియా, డోంగ్రీ నృత్యం, హళక్కి సుగ్గి కునిత, కంగీ విన్యాసాలు, యోగ్ చాప్, డ్రమ్స్ విన్యాసాలు వంటి సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించారు.
తెలంగాణ కళాకారులు అన్నమయ్య పదావళి నృత్యరూపకంతో భక్తిభావాన్ని చాటగా, తిరుపతి బాలమందిరం విద్యార్థులు కోలాట ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
నృత్యాభినయాలతో అలరించిన కళాకారులు
మేళతాళాలు, మృదంగ నాదాలు, గజ్జెల సవ్వడుల నడుమ కళాకారులు లయబద్ధమైన నృత్యాభినయాలతో శ్రీవారి వైభవాన్ని ఆవిష్కరించారు. మధురమైన గాత్ర సంగీతం, వాద్యాల లయకు అనుగుణంగా హస్తముద్రలు, అంగవిన్యాసాలతో దైవలీలలను అభినయించారు. రంగురంగుల సంప్రదాయ వస్త్రధారణలో కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు తిరుమాడ వీధులకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.
భక్తి.. కళ.. సంస్కృతుల సమ్మేళనం
శ్రీవారి వాహనసేవలో భక్తి సంగీతం, శాస్త్రీయ నృత్యాలు, జానపద కళారూపాలు, భారతీయ సంప్రదాయాలు కలగలిసిన ప్రదర్శనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. గోవింద నామస్మరణల మధ్య సాగిన సింహ వాహనసేవకు కళాకారుల ప్రదర్శనలు మరింత వైభవాన్ని చేకూర్చి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచాయి.


































