STRENGTHENED QUALITY MONITORING IN THE PREPARATION OF SRIVARI PRASADAM _ శ్రీవారి ప్రసాదాల తయారీలో నాణ్యత పర్యవేక్షణ మరింత బలోపేతం

13 POTU WORKER SENIORS PROMOTED AS SUPERVISORS

TTD EO AND ADDITIONAL EO HAND OVER PROMOTION ORDERS

Tirumala, October 14, 2026: The Tirumala Tirupati Devasthanams has taken a key decision to further strengthen the monitoring of quality standards in the preparation of Srivari prasadam. As part of this initiative, 13 Potu Worker Seniors, who had been awaiting promotions for several years, have been promoted as Potu Supervisors.

Following the Simha Vahana Seva on Wednesday, TTD Executive Officer Sri Muddada Ravichandra and Additional Executive Officer Sri C.H. Venkayya Chowdary handed over the promotion orders to the employees at the Srivari Temple in Tirumala.

The TTD Chairman, Sri B.R. Naidu, had facilitated a resolution in the TTD Trust Board and submitted proposals to the State Government seeking promotions for the 13 employees who had been serving as Potu Worker Seniors for several years. The State Government approved the proposals and issued the necessary orders, completing the promotion process.

The promoted employees expressed their gratitude to TTD Chairman Sri B.R. Naidu, the Trust Board members, EO Sri Muddada Ravichandra and Additional EO Sri C.H. Venkayya Chowdary. They welcomed the resolution of their long-pending promotion issue.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శ్రీవారి ప్రసాదాల తయారీలో నాణ్యత పర్యవేక్షణ మరింత బలోపేతం

13 మంది పోటు వర్కర్ సీనియర్లకు సూపర్‌వైజర్లుగా పదోన్నతి

పదోన్నతి ఉత్తర్వులు అందజేసిన టీటీడీ ఈవో, అదనపు ఈవో

తిరుమల, 2026 అక్టోబరు 14: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ప్రసాదాల తయారీలో నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేసే దిశగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దీర్ఘకాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 13 మంది పోటు వర్కర్ సీనియర్లకు పోటు సూపర్‌వైజర్లుగా పదోన్నతులు కల్పించింది.

సింహ వాహనసేవ అనంతరం బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి పదోన్నతి ఉత్తర్వులను వారికి అందజేశారు.

గత కొన్ని సంవత్సరాలుగా పోటు వర్కర్ సీనియర్లుగా విధులు నిర్వహిస్తున్న 13 మందికి పదోన్నతులు కల్పించాలని కోరుతూ టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు పాలకమండలిలో (Res. No. 576, Dt. 1612.2025) 

తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పదోన్నతుల ప్రక్రియ పూర్తయింది.

ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన ఉద్యోగులు టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, పాలకమండలి సభ్యులు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న తమ పదోన్నతుల సమస్య పరిష్కారం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది