CHAIRMAN, EO THANK ALL TOWARDS THE SUCCESS OF NAVARATRI BRAHMOTSAVAMS _ సమిష్టి కృషితో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం

TIRUMALA, 20 OCTOBER 2026: TTD Chairman Sri BR Naidu along with TTD EO Sri M Ravichandra extended heartfelt gratitude to all officials, staff, priests, sevaks,  police and district administration, media for their impeccable services during Navaratri Brahmotsavams and above all devotees for their cooperation inspite of inclement weather conditions.

As Srivari Navaratri Brahmotsavams concluded in a grand manner, TTD Chairman held a media conference at Annamayya Bhavan in Tirumala on Tuesday noon.

Some excerpts :

Srivari Navaratri Brahmotsavams, held at Tirumala from October 12 to 20, concluded successfully with the coordinated efforts of everyone.

Devotees from across the world witnessed darshans of both the Moola Virat Seva and Vahana Sevas in a comfortable way.

Despite continuous heavy rain on the day of Garuda Seva, devotees witnessed the sacred event with devotion. 

Everyone discharged their respective duties wearing  rain coats with perfection

Key Services:

6.46 lakh devotees had Srivari darshan from October 12 to 19.

Hundi offerings totalled Rs. 25.79 crore.

22.60 lakh Anna Prasadam packets were distributed.

2.44 lakh devotees offered tonsure.

34.34 lakh laddus were sold.

APSRTC operated 13,608 trips from Tirupati to Tirumala carrying 4.01 lakh devotees, and 13,667 return trips carrying 5 lakh devotees.

Garuda Seva Arrangements

Received positive feedback on the arrangements from pilgrims.

Cultural Programmes:

About 6,777 artistes from 252 troupes, representing 26 States along with  Qatar and Dubai, presented diverse art forms before the Vahana Sevas. 

On Garuda Seva day alone, 863 artistes from 31 troupes across 17 States performed. 

TTD EO felicitated four outstanding cultural troupes every day.

Decorations and Telecast:

Floral decorations in Tirumala used about 60 tonnes of flowers, 5 lakh cut flowers, and 80,000 seasonal flowers. 

Electric illuminations in Tirumala and Tirupati attracted devotees, while 36 large digital screens facilitated easy viewing of the Vahana Sevas. 

SVBC telecast the Brahmotsavams worldwide in enhanced quality, with commentary by eminent scholars.

Health, Security and Sanitation:

4,500 Srivari Seva volunteers rendered dedicated service during the nine day festival.

Medical arrangements included 75 doctors, 10 Srivari Arogya Seva doctors, 60 paramedical staff, 20 ambulances, and four mobile clinics.

Security was ensured by 2,800 police personnel and 2,000 vigilance staff, with an additional 1,000 police personnel on Garuda Seva day.

Advance parking plans ensured smooth traffic movement in Tirumala and Tirupati.

On Garuda Seva day, 3,500 sanitation workers served in Tirumala and cleared about 183 tonnes of segregated wet and dry waste.

Goshala and Transport:

For devotee safety and elephant welfare, devotees were prohibited from seeking blessings directly from elephants. Strict safety measures were implemented for cows, horses, and bulls participating in the Vahana Sevas.

TTD’s transport wing deployed 39 electric buses and ferried 7 lakh devotees in 6,900 trips over the last ten days.

Exhibition:

An exhibition at Kalyana Vedika, organised by the TTD Public Relations Department, showcased rare Tirumala photographs, information on TTD temples, Ayurveda, SV Institute of Sculpture, Forest, and Garden departments. It received an encouraging response from devotees.

Around 600 TTD employees from various departments in Tirupati rendered special services during Garuda Seva. Sectoral Officers and Incharge officers monitored the pilgrim facilities round the clock.

Additional EO Sri Ch Venkaiah Chowdary, CVSO Sri Muralikrishna and other officers were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

సమిష్టి కృషితో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం

భక్తులకు వాహనసేవలతో పాటు మూలమూర్తి దర్శన

భారీ వర్షంలోనూ గరుడసేవకు విశేష ఏర్పాట్లు : టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు

తిరుమల, అక్టోబరు 20, 2026:  టీటీడీ, జిల్లా, పోలీసు యంత్రాంగాల సమన్వయం, అర్చక స్వాములు, అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తుల సమిష్టి కృషితో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, భక్తులకు అందించిన సేవలను వివరించారు.

అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు జరిగిన బ్రహ్మోత్సవాల్లో దేశవిదేశాల నుంచి విచ్చేసిన భక్తులకు వాహనసేవలతో పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించామని చెప్పారు. గరుడసేవ రోజున ఉదయం నుంచి భారీ వర్షం కురిసినా భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారి సేవను వీక్షించారని, వారికి అల్పాహారం, అన్నప్రసాదాలు, బాదం పాలు, సుండలు, జ్యూస్, బిస్కెట్లు అందించామని తెలిపారు.

 బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అందించిన సేవలు

అక్టోబరు 12 నుంచి 19వ తేదీ వరకు ఎనిమిది రోజుల్లో:

•  6.46 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం

•  రూ.25.79 కోట్ల హుండీ కానుకలు.

•  22.60 లక్షల అన్నప్రసాదాల పంపిణీ.

•  2.44 లక్షల మంది భక్తుల తలనీలాల సమర్పణ.

•  34.34 లక్షల లడ్డూల విక్రయం.

గరుడసేవ రోజున  చైర్మన్ తో కలసి పాలకమండలి సభ్యులు, ఉన్నతాధికారులు గ్యాలరీలు, క్యూలైన్లలో పర్యటించి భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.

సాంస్కృతిక, పుష్ప, విద్యుత్ అలంకరణలతో ఆధ్యాత్మిక వైభవం

వాహనసేవలకు ముందు 26 రాష్ట్రాలు మరియు ఖతర్, దుబాయ్ నుంచి వచ్చిన 252 కళాబృందాలకు చెందిన సుమారు 6,777 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు. గరుడసేవ రోజున 17 రాష్ట్రాల నుంచి 31 కళాబృందాలకు చెందిన 863 మంది కళాకారులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనలిచ్చిన కళాబృందాలను ప్రతిరోజూ టీటీడీ ఈవో సన్మానించారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా సుమారు 60 టన్నుల పుష్పాలు, 5 లక్షల కట్‌ఫ్లవర్స్, 80 వేల సీజనల్ పుష్పాలతో అలంకరణలు చేపట్టాం. తిరుమల, తిరుపతిలో విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేయడంతో పాటు వాహనసేవల వీక్షణకు 36 భారీ డిజిటల్ స్క్రీన్లు అందుబాటులో ఉంచాం. ప్రపంచవ్యాప్తంగా భక్తులు బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించాం.

రవాణా, వైద్య, భద్రతా ఏర్పాట్లు

ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు 13,608 ట్రిప్పుల్లో 4.01 లక్షల మంది, తిరుమల నుంచి తిరుపతికి 13,667 ట్రిప్పుల్లో 5 లక్షల మంది ప్రయాణించారు. తిరుమలలో 39 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురాగా, గత పది రోజుల్లో 6,900 ట్రిప్పుల ద్వారా సుమారు 7 లక్షల మంది భక్తులకు స్థానిక రవాణా సౌకర్యం కల్పించాం.

భక్తులకు సేవలందించేందుకు 4,500 మంది శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. వైద్య సేవల కోసం 85 మంది వైద్యులు, 60 మంది పారామెడికల్ సిబ్బంది, 20 అంబులెన్సులు, నాలుగు మొబైల్ క్లినిక్‌లను అందుబాటులో ఉంచాం.

బ్రహ్మోత్సవాల్లో 2,800 మంది పోలీసులు, 2,000 మంది విజిలెన్స్ సిబ్బంది విధులు నిర్వహించగా, గరుడసేవ రోజున అదనంగా 1,000 మంది పోలీసులను ఏర్పాటు చేశాం. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాం

పారిశుద్ధ్యం, భక్తుల భద్రతకు ప్రాధాన్యం

గరుడసేవ రోజున 3,500 మంది పారిశుద్ధ్య సిబ్బంది సేవలందించారు. సేకరించిన సుమారు 183 టన్నుల తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించారు. 

సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల విజయవంతానికి సహకరించిన అర్చక స్వాములు, పాలకమండలి సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగాలు, శ్రీవారి సేవకులు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, భక్తులకు చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా భక్తులకు చేరవేసిన మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ సదాశివరావు, శ్రీ నరేష్ కుమార్, శ్రీ దర్శన్, సివిఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడింది.