SRI MAHALAKSHMI DEEPOTSAVAM CELEBRATED WITH DEVOTION IN KUPPAM _ కుప్పంలో భక్తిశ్రద్ధలతో వైభవంగా శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవం
MRS. NARA BHUVANESWARI PARTICIPATES IN RITUALS AS A DEVOTEE
LIGHT OF THE GODDESS BRINGS PEACE AND PROSPERITY TO DEVOTEES: TTD ADDITIONAL EO SRI CH. VENKAIAH CHOWDARY
DEVOTEES SHOULD SEEK THE BLESSING OF GODDESS MAHALAKSHMI: TTD JEO DR. A. SHARATH
Tirupati / Kuppam, October 20, 2026: The Sri Mahalakshmi Deepotsavam organised by TTD in Kuppam on Tuesday was celebrated with great devotion and spiritual fervour. A large number of women and devotees participated in the programme, lit lamps and offered collective prayers. Vedic chants, Annamacharya devotional songs and the glow of lamps filled the venue with a divine atmosphere.
Mrs. Nara Bhuvaneswari Participates as a Devotee
Mrs. Nara Bhuvaneswari, wife of Chief Minister Sri N. Chandrababu Naidu, participated in the rituals as an ordinary devotee and performed the prescribed prayers along with other devotees.
Deepotsavam Spreads Spiritual Light: Additional EO
TTD Additional EO Sri C.H. Venkaiah Chowdary said that the lamp symbolises the removal of darkness and the spread of knowledge. He stated that the monthly programme, jointly organised by TTD, Hindu Dharma Prachara Parishad (HDPP) and Sri Venkateswara Bhakti Channel (SVBC), promotes devotion, spiritual unity and Sanatana Dharma traditions. The Deepotsavam has been conducted five times since its inception.
Devotees Should Seek the Goddess’s Blessings: JEO
TTD JEO Dr. A. Sarath said the Deepotsavam is organised every month to encourage devotion and preserve traditional religious practices. He urged devotees to participate in the Vijayadashami special worship with faith and devotion.
He said each puja kit provided to women devotees contained 24 types of ritual items, including kumkum, akshata, fruits, flowers, mangalsutram and bangles. After the rituals, devotees received holy water and five varieties of prasadam.
Traditional Rituals and Collective Deepa Aradhana
Priests from the Tirumala Srivari Temple performed Vishwaksena Puja, Punyahavachanam and Srinivasa Archana according to Vaikhanasa Agama traditions for Sri Venkateswara Swamy along with Sridevi and Bhudevi, and for Sri Chaturbhuja Mahalakshmi Ammavaru. Vedic scholars recited the Vishnu Sahasranamam, followed by special worship to the Goddess.
Annamacharya Project artistes enthralled devotees with devotional songs. The priests led the devotees in reciting the Deepa Mantram and performing collective Lakshmi Neerajanam. The venue glowed with the light of lamps as devotees prayed for prosperity, good health, happiness and peace in every family. Nakshatra Harathi and Kumbha Harathi were offered at the conclusion.
A woman devotee from Bengaluru expressed happiness at attending the programme and said that organising such a spiritual event in Kuppam was a blessing for the local people.
SVBC telecast the programme live.
TTD Board Member Sri Shantaram, HDPP Secretary Dr. Medasani Mohan, priests, Vedic scholars, TTD officials, staff and a large number of devotees participated in the event.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
కుప్పంలో భక్తిశ్రద్ధలతో వైభవంగా శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవం
సామాన్య భక్తురాలిగా పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు చేసిన శ్రీమతి నారా భువనేశ్వరి
భక్తుల జీవితాల్లో వెలుగులు నింపే అమ్మవారు – టీటీడీ అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి
అమ్మవారి కృపకు పాత్రులు కావాలి – టీటీడీ జేఈవో డా. ఎ. శరత్
దీపకాంతులు.. భక్తి సంకీర్తనలు.. సామూహిక దీపారాధనతో ఆధ్యాత్మిక శోభ
తిరుపతి / కుప్పం, 2026 అక్టోబరు 20: సకల సంపదలకు అధిష్ఠాత్రి అయిన శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం టీటీడీ ఆధ్వర్యంలో కుప్పంలో మంగళవారం నిర్వహించిన శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవం భక్తిభావంతో వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు, భక్తజనం పాల్గొని దీపాలు వెలిగించి సామూహికంగా అమ్మవారికి దీపారాధన చేశారు. వేదమంత్రాలు, అన్నమాచార్య సంకీర్తనలు, దీపకాంతులతో పూజా ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.
సామాన్య భక్తురాలిగా పూజల్లో పాల్గొన్న శ్రీమతి నారా భువనేశ్వరి
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి ఈ కార్యక్రమానికి సామాన్య భక్తురాలిగా హాజరై, ఇతర భక్తులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. భక్తులతో మమేకమై శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని పూజించారు.
భక్తుల జీవితాల్లో వెలుగులు నింపే దీపపూజ : టీటీడీ అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి
దీపం అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే పవిత్ర ప్రతీక అని టీటీడీ అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ (హెచ్డీపీపీ), శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ దీపోత్సవం మహిళా భక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారిలో భక్తిభావాన్ని పెంపొందించడంతోపాటు సనాతన ధర్మ సంప్రదాయాలను విస్తృతంగా ప్రచారం చేస్తోందన్నారు.
దీపోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు నిర్వహించినట్లు తెలిపారు. భక్తులందరూ కలసి సామూహికంగా పూజలు నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక ఐక్యత పెరుగుతుందని, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శుభాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
అమ్మవారి కృపకు పాత్రులు కావాలి : టీటీడీ జేఈవో డా. ఎ. శరత్
టీటీడీ, హెచ్డీపీపీ, ఎస్వీబీసీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి నెలా శ్రీ మహాలక్ష్మీ దీపపూజ నిర్వహిస్తున్నట్లు టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ తెలిపారు.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ పవిత్ర పూజలో భక్తులు అర్చకుల సూచనల మేరకు శ్రద్ధాభక్తులతో పాల్గొని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు.
మహిళా భక్తులకు అందించిన పూజా కిట్లో 24 రకాల పూజా సామగ్రి ఉన్నట్లు తెలిపారు. శ్రీ పద్మావతీ అమ్మవారి కుంకుమ, అక్షింతలు, పండ్లు, పూలు, మంగళసూత్రం, కంకణాలు తదితర వస్తువులను పూజ అనంతరం అందజేసినట్లు వివరించారు.
పూజ అనంతరం భక్తులపై పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేసి, అమ్మవారికి నివేదించిన ఐదు రకాల ప్రసాదాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. భక్తులందరూ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి ఆమె దివ్యానుగ్రహాన్ని పొందాలని సూచించారు.
ఐశ్వర్యం, సౌభాగ్యం, శుభాలకు ప్రతీక దీపపూజ
దీపం జ్ఞానానికి, పవిత్రతకు, శుభానికి ప్రతీక. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని దీపాలతో ఆరాధించడం ద్వారా కుటుంబాల్లో సుఖశాంతులు, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని భక్తులు ప్రార్థిస్తారు. ముఖ్యంగా మహిళలు కుటుంబ సంక్షేమం, సంతాన శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ఈ పూజను భక్తితో నిర్వహిస్తారు.
ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల్లో ధార్మిక చైతన్యాన్ని పెంపొందించడంతోపాటు సనాతన ధర్మ సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఆగమోక్తంగా శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి విశేష పూజలు
ఈ సందర్భంగా ఆగమ సలహాదారులు శ్రీ శ్రీనివాసాచార్యులు శ్రీ మహాలక్ష్మీ దీపపూజ ప్రాశస్త్యాన్ని వివరించారు.
అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారికి, శ్రీ చతుర్భుజ మహాలక్ష్మీ అమ్మవారికి వైఖానస ఆగమశాస్త్రోక్తంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసార్చన నిర్వహించారు. వేద పండితులు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేశారు. అనంతరం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి విశేష పూజలు సమర్పించారు.
అన్నమాచార్య సంకీర్తనలతో భక్తిపారవశ్యం
అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం అర్చకులు భక్తులతో మూడుసార్లు దీపమంత్రాన్ని పలికించి, సామూహికంగా లక్ష్మీ నీరాజనం సమర్పించారు.
భక్తులందరూ ఒకేసారి దీపాలు వెలిగించి దీపారాధన చేయడంతో పూజా ప్రాంగణమంతా దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. చివరగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి కుటుంబంలో ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, శాంతి వెల్లివిరియాలని భక్తులు ప్రార్థించారు.
ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
బెంగళూరు నుంచి వచ్చి దీపపూజలో పాల్గొన్న భక్తురాలు
బెంగళూరుకు చెందిన ఓ మహిళా భక్తురాలు మాట్లాడుతూ, కుప్పంలో నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవంలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా వచ్చానని తెలిపారు. కుప్పంలో ఇంతటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించడం ఇక్కడి ప్రజల అదృష్టమని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతారాం, హెచ్డీపీపీ కార్యదర్శి డా. మేడసాని మోహన్, అర్చక బృందం, వేద పండితులు, టీటీడీ అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.






























