AYUDHA PUJA CELEBRATED AT TTD TRANSPORT DEPARTMENT _ టీటీడీ రవాణా విభాగంలో భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ

SPECIAL PRAYERS OFFERED TO VEHICLES AND MACHINERY AS PER TRADITION

Tirupati, October 30, 2026: TTD celebrated Ayudha Puja with devotion at its Transport Department on Friday.

TTD Chairman Sri B.R. Naidu, EO Sri Muddada Ravichandra and JEO (Education & Health) Sri Prabhala Gopinath participated in the celebrations.

The priests welcomed them traditionally under the guidance of Transport Department GM Sri Ramu. Special prayers were offered to Lord Venkateswara, followed by traditional rituals for the department’s vehicles and machinery, seeking prosperity, safety and well-being.

After the puja, the priests distributed Theertha Prasadam. GM Sri Ramu felicitated the Chairman, EO and JEO with shawls.

TTD Board Member Sri Naresh Kumar, Transport DM Smt. Lakshmi Prasanna, DI Sri Mohan, and other officials and employees participated in the programme.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

టీటీడీ రవాణా విభాగంలో భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ

వాహనాలు, యంత్ర పరికరాలకు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు

తిరుపతి, అక్టోబరు 30, 2026: టీటీడీ రవాణా విభాగంలో శుక్రవారం ఆయుధ పూజ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, జేఈవో (విద్య, ఆరోగ్యం) శ్రీ ప్రభల గోపీనాథ్ పాల్గొన్నారు.

రవాణా విభాగానికి చేరుకున్న చైర్మన్, ఈవో, జేఈవోలకు విభాగాధిపతి శ్రీ రాము ఆధ్వర్యంలో అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

అనంతరం శ్రీవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయుధ పూజలో భాగంగా రవాణా విభాగానికి చెందిన వాహనాలు, యంత్ర పరికరాలకు శాస్త్రోక్తంగా పూజలు చేసి, సర్వతోముఖాభివృద్ధి, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.

పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రవాణా విభాగం జీఎం శ్రీ రాము చైర్మన్, ఈవో, జేఈవోలను శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నరేష్ కుమార్, ట్రాన్స్‌పోర్ట్ డీఎం శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, డీఐ శ్రీ మోహన్, పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.