SPECIAL FESTIVALS AT SRI GOVINDARAJA SWAMY TEMPLE IN NOVEMBER _ నవంబరులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, November 4, 2026: Several special festivals and religious events will be held at Sri Govindarajaswamy Temple, Tirupati, during November.

Key events include:

•  November 5: Sri Govindarajaswamy with His Consorts will bless devotees in the temple streets at 6 PM.

• November 6, 20 and 27: Sri Andal Ammavaru procession at 6 PM.

• November 11: Tirumala Nambi Sattumora.

• November 13: Manavala Mamuni Sattumora with a procession of the deities.

•  November 14: Senadhipathi Sattumora.

• November 16: Sri Poigai Alwar Thirunakshatram and Sri Kalyana Venkateswara Swamy procession at 6 PM.

• November 21: Kaisika Dwadasi Asthanam and Puranic discourse.

• November 24: Sri Thirumangai Alwar Sattumora and Karthika Deepotsavam at 6 PM.

• November 25: Sri Parthasarathy Swamy procession with Rukmini and Satyabhama at 6 PM.

TTD appeals to devotees to participate in these festivals and receive the blessings of the deities.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

నవంబరులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

వివిధ పర్వదినాలు, ఆళ్వార్ల శాత్తుమొరలు, స్వామివారి వీధి ఉత్సవాలు

తిరుపతి, 2026 నవంబరు 04: తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నవంబరు నెలలో పలు విశేష పర్వదినాలు, ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారు, అమ్మవార్లు వివిధ వాహనాలు, తిరువీధి ఉత్సవాల్లో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించనున్నారు. ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

•  నవంబరు 5: ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు ఉభయ నాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.

•  నవంబరు 6, 20, 27: శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

•  నవంబరు 11: తిరుమల నంబి శాత్తుమొర నిర్వహించనున్నారు.

•  నవంబరు 13: శ్రీ మనవాళ మహాముని శాత్తుమొర సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ మనవాళ మహామునితో కలిసి సాయంత్రం మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

•  నవంబరు 14: సేనాధిపతి శాత్తుమొర ఉత్సవం నిర్వహించనున్నారు.

•  నవంబరు 16: శ్రీ పోయిగై ఆళ్వార్ తిరునక్షత్రం నిర్వహించనున్నారు. అదే రోజున శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు ఉభయ నాంచారులతో కలిసి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

•  నవంబరు 21: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం, పురాణ ప్రవచనం నిర్వహించనున్నారు.

•  నవంబరు 24: శ్రీ తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఆలయంలో కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.

•  నవంబరు 25: రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ విశేష ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి, అమ్మవార్ల దివ్య మంగళ దర్శనం చేసుకుని వారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని టీటీడీ కోరుతోంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి చేత విడుదల చేయబడినది.