DEEPAVALI ASTHANAM HELD  _ శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం

TTD MANDARINS EXTEND GREETINGS 

TIRUMALA, 08 NOVEMBER 2026: On the auspicious occasion of Deepavali, the festival of lights, the customary Deepavali Asthanam was observed in Tirumala temple on Sunday.

As part of the celebrations, the processional deities of Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi, and Vishvaksena, were ceremoniously seated at the Garuda Alwar Sannidhi near the Bangaru Vakili. Special pujas were performed to the deities.

Later, new silk vastrams were presented to the presiding deity and the processional deities. 

TTD Specified Authority Chairman and Executive Officer Sri M Ravi Chandra conveyed Deepavali greetings to Srivari devotees present across the globe. 

TTD Additional Executive Officer Sri CH Venkaiah Chowdary, CVSO Sri Murali Krishna have also extended their Diwali wishes.

Both the pontiffs of Tirumala, religious and temple staff were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం

తిరుమల, 2026 నవంబర్ 08: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు.

ఇందులో భాగంగా శ్రీ మలయప్పస్వామివారు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను బంగారు వాకిలి వద్ద గరుడాళ్వారు సన్నిధిలో వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కర్పూర మంగళహారతులు, ప్రసాద నివేదనలు సమర్పించారు. అనంతరం మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలను సమర్పించి, రూపాయి హారతి, ప్రత్యేక హారతులు నిర్వహించడంతో దీపావళి ఆస్థానం ముగిసింది.

ఈ సందర్భంగా టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, దీపావళి పర్వదినాన శ్రీవారి భక్తులతో పాటు ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులతో దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, పిల్లలు, ఆప్తులతో కలిసి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలో ఉగాది, ఆణివార ఆస్థానం, దీపావళి, శ్రీరామనవమి, గోకులాష్టమి సందర్భంగా సంవత్సరానికి నాలుగుసార్లు ఆస్థానం నిర్వహిస్తారని తెలిపారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆగమ సంప్రదాయాలను అనుసరిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో స్వామివారి కృపతో వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ భక్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.