DIWALI ASTHANAM PERFORMED AT TTD LOCAL TEMPLES _ టీటీడీ స్థానిక ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో దీపావళి ఆస్థానం
Tirupati | November 08, 2026: Diwali Asthanam was performed with religious fervour at Sri Govindarajaswamy and Sri Kodandarama Swamy temples in Tirupati on Sunday.
At both temples, new clothes and lamps were offered to the deities, followed by special rituals as per tradition.
TTD cancelled Sahasra Kalasabhishekam and Hanumantha Vahana Seva at Sri Kodandarama Swamy Temple on account of Amavasya.
The Jeeyar Swamijis, Deputy EOs, temple officials and priests participated in the rituals.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
టీటీడీ స్థానిక ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో దీపావళి ఆస్థానం
శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు.. నూతన వస్త్రాలు, దీపాల సమర్పణ
తిరుపతి | నవంబరు 08, 2026: తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాలైన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివార్ల ఆలయాల్లో ఆదివారం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దీపావళి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో..
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయం నుంచి సాయంత్రం నూతన వస్త్రాలు, దీపాలను ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం నిర్వహించారు.
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో..
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి దీపావళి ఆస్థానాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలను తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలతో దీపావళి ఆస్థానం నిర్వహించారు.
అమావాస్య సందర్భంగా ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేక సేవ, హనుమంత వాహనసేవను టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమాల్లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, డెప్యూటీ ఈవోలు శ్రీమతి శాంతి, శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.







