TTD 2027 CALENDARS AND DIARIES AVAILABLE FOR ONLINE BOOKING _ భక్తులకు ఆన్లైన్లో టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీల బుకింగ్ సదుపాయం
Tirupati | November 09, 2026: TTD has provided an online booking facility for its 2027 calendars and diaries through its official website: https://ttdevasthanams.ap.gov.in.
They are also available at 12 TTD publication sales counters in Tirupati, Tirumala and Tiruchanoor, and TTD Information Centres in Hyderabad, Vijayawada, Chennai, Vellore, Bengaluru, New Delhi and Mumbai.
The 2027 calendars and diaries were released by the Hon’ble Chief Minister of Andhra Pradesh on September 7, 2026, and sales began on the same day.
TTD appeals to devotees to make use of this facility and book online or purchase the calendars and diaries at the nearest TTD sales centre.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
భక్తులకు ఆన్లైన్లో టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీల బుకింగ్ సదుపాయం
తిరుపతి, నవంబరు 09, 2026: నూతన సంవత్సరం – 2027ను పురస్కరించుకుని టీటీడీ ప్రచురించిన క్యాలెండర్లు, డైరీలను భక్తులు ఆన్లైన్లో బుకింగ్ చేసేందుకు టీటీడీ సదుపాయం కల్పించింది.
భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా 2027 క్యాలెండర్లు, డైరీలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.
అదేవిధంగా, తిరుపతి, తిరుమల, తిరుచానూరులోని టీటీడీ ప్రచురణల విక్రయ విభాగానికి చెందిన 12 విక్రయ కేంద్రాల్లోనూ ఈ క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, హిమాయత్నగర్తో పాటు విజయవాడ, చెన్నై, వెల్లూరు, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై నగరాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో కూడా వీటిని విక్రయిస్తున్నారు.
కాగా, 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు 2026 సెప్టెంబరు 7వ తేదీన ఆవిష్కరించగా, అదే రోజు నుంచి విక్రయాలు ప్రారంభమయ్యాయి.
కావున, భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీలను టిటిడి అధికారిక వెబ్సైట్ ద్వారా బుకింగ్ లేదా టిటిడి సమాచార కేంద్రాల వద్ద కొనుగోలు చేయాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.




