SUBRAHMANYA SWAMY HOMAM BEGINS AT KAPILATHEERTHAM _ కపిలతీర్థంలో వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ప్రారంభం
Tirupati, November 12, 2026: As part of the month-long Karthika Masa Homam celebrations at Sri Kapileswara Swamy Temple in Tirupati, Sri Subrahmanya Swamy Homam commenced with special rituals on Thursday.
Special pujas, homam and other rituals were performed in the morning. The homam will continue on Friday. Devotees can participate by paying ₹500 per day. Participants will receive prasadam and traditional offerings.
Temple Deputy EO Nag Ratna, AEO Kumari Devi, temple priests, officials and devotees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
కపిలతీర్థంలో వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ప్రారంభం
కార్తీక మాస హోమ మహోత్సవాల్లో భాగంగా విశేష పూజలు, హోమాలు
తిరుపతి, నవంబరు 12, 2026: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న కార్తీక మాస హోమ మహోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగశాలలో విశేష పూజలు, హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వహించనున్నారు. శుక్రవారం కూడా హోమం కొనసాగనుంది.
గృహస్తులు రూ.500 చెల్లించి ఒకరోజు హోమంలో పాల్గొనవచ్చు. పాల్గొనే వారికి ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీమతి కుమారి దేవి, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




