TTD ADDITIONAL EO INSPECTION IN TIRUMALA _ తిరుమలలో టీటీడీ అదనపు ఈవో తనిఖీలు 

TIRUMALA,  12 NOVEMBER 2026: TTD Additional Executive Officer Sri Ch.Venkaiah Chowdary on Thursday inspected the Pedestrian Pathway from Madhava Nilayam (PAC-2) to the GNC Toll Gate, along the Alipiri footpath route leading to Tirumala.

He instructed officials concerned to display information regarding darshan and free accommodation facilities along the pathway for the convenience of pilgrims and also discussed other development works to be taken up along the route.

He inspected the shops along the pathway and directed the shopkeepers to sell drinking water and food items at prescribed prices only and also made it clear that encroachments would not be permitted.

SE 2 Sri Venugopal, Dy  EOs Sri Venkateswarlu and Sri Somannarayana, DE Sri Chandra Sekhar and other officials participated in the inspection.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

తిరుమలలో టీటీడీ అదనపు ఈవో తనిఖీలు 

తిరుమల, 2026 నవంబర్ 12: టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలకు అలిపిరి నుండి కాలినడకన వచ్చే మార్గంలోని మాధవ నిలయం(పిఏసి-2)  నుంచి జిఎన్సీ టోల్ గేట్ వరకు ఉన్న నడక మార్గాన్ని గురువారం పరిశీలించారు.

ఈ మార్గంలో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా దర్శనం, ఉచిత వసతుల సమాచారాన్ని పొందుపరచాలని అధికారులకు సూచించారు. ఈ మార్గంలో చేపట్టాల్సిన ఇతర అభివృద్ధి పనుల గురించి చర్చించారు.

ఇక్కడి దుకాణాలను తనిఖీ చేసి తాగునీరు, తినుబండారాలను నిర్దేశిత ధరలకు విక్రయించాలని,  ఆక్రమణలు ఉండకూడదని స్పష్టం చేశారు.

ఈ తనిఖీల్లో ఎస్.ఇ.-2 శ్రీ వేణుగోపాల్, డిప్యూటీ ఈవోలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ సోమన్నారాయణ, డిఈ శ్రీ చంద్ర శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.