ONLY TWO DAYS LEFT FOR SV MUSEUM TRIAL RUN _ నవంబర్ 14, 15వ తేదిలతో ముగియనున్న మ్యూజియం ట్రయల్ రన్‌

Tirumala, 13 November 2026: The trial run of the newly modernised Sri Venkateswara Museum in Tirumala has been extended until November 15. 

TTD employees and their families, media representatives working in Tirumala and Tirupati and their families, students of TTD educational institutions, and Srivari Sevaks are permitted free entry from 10 AM to 5 PM on November 14 and 15.

After the trial run, the museum will be opened to devotees from November 16 onwards, with an entrance fee of Rs. 50.

TTD urges all eligible visitors to make use of this opportunity and experience the grandeur of “Brahmandam”.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

నవంబర్ 14, 15వ తేదిలతో ముగియనున్న మ్యూజియం ట్రయల్ రన్‌

16 వ తేది నుండి భక్తులకు అనుమతి

తిరుమల, 2026 నవంబర్ 13: తిరుమలలో నూతనంగా ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం సందర్శనకు నిర్వహిస్తున్న ట్రయల్ రన్‌ను నవంబర్ 15వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ ట్రయల్ రన్‌కు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో, నవంబర్ 14, 15 తేదీల్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా టీటీడీ కోరుతోంది.

ఈ నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, తిరుమల, తిరుపతిలో పనిచేసే మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, టీటీడీ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు, శ్రీవారి సేవకులను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యూజియం సందర్శనకు ఉచితంగా అనుమతించడం జరుగుతుంది.

ట్రయల్ రన్ పూర్తయిన అనంతరం నవంబర్ 16వ తేదీ నుంచి భక్తులను మ్యూజియం సందర్శనకు అనుమతించడం జరుగుతుంది. మ్యూజియం ప్రవేశ రుసుమును రూ.50గా నిర్ణయించడం జరిగింది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.