40-GRAM GOLD BRACELET TRACED THROUGH CCTV AND RETURNED TO DEVOTEE
Tirumala, November 14, 2026: A gold bracelet weighing about 40 grams, accidentally lost by Hyderabad devotee Sripada Raja Sruthi near the drinking water point close to the Prasadam Distribution Centre in Tirumala on Friday, was traced through CCTV footage and safely returned to her by TTD Vigilance and Security staff.
Some devotees walking behind her noticed the bracelet falling from her hand and picked it up. The Command Control staff noticed the incident through CCTV cameras and immediately took action.
On the instructions of TTD CVSO Sri K.V. Muralikrishna, the bracelet was traced by Command Control AVSO Sri Venkataramana and his team under the supervision of Vigilance Officer Sri Surendra. It was subsequently handed over to the rightful owner, AVSO Sri Venkataramana said.
The devotee expressed happiness and thanked TTD Vigilance and Security officials and staff for their prompt response.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
సీసీటీవీ నిఘాతో 40 గ్రాముల బంగారు కడియం గుర్తింపు – భక్తురాలికి సురక్షితంగా అప్పగింత
తిరుమల, 2026 నవంబర్ 14: తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు శ్రీపాద రాజ శృతి ప్రసాదం పంపిణీ కేంద్రం సమీపంలోని తాగునీటి పాయింట్ వద్ద అనుకోకుండా పోగొట్టుకున్న సుమారు 40 గ్రాముల బంగారు కడియాన్ని శుక్రవారం పోగొట్టుకున్నారు. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి, తిరిగి ఆమెకు అందజేశారు.
భక్తురాలి చేతి నుంచి కడియం జారిపడిన విషయాన్ని వెనుక ఉన్న కొంతమంది భక్తులు గుర్తించి తీసుకున్నారు. ఈ ఘటనను కమాండ్ కంట్రోల్ సిబ్బంది సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు.
టీటీడీ సీవీఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ ఆదేశాల మేరకు, విజిలెన్స్ అధికారి (వీజీఓ) శ్రీ సురేంద్ర పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ ఏవీఎస్వో శ్రీ వెంకటరమణ, సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి కడియాన్ని గుర్తించారు. అనంతరం అసలు యజమానురాలైన భక్తురాలికి అప్పగించినట్లు ఏవీఎస్వో శ్రీ వెంకటరమణ తెలిపారు.
తన విలువైన బంగారు కడియం తిరిగి లభించడంతో భక్తురాలు ఆనందం వ్యక్తం చేస్తూ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.


