AGAMA SHASTRAS FORM THE FOUNDATION OF TEMPLE TRADITIONS _ దేవాలయ సంస్కృతికి ఆగమ శాస్త్రాలే ప్రామాణికం
Tirumala, 16 November 2026: Scholars stressed that Agama Shastras play a vital role in preserving temple worship traditions and Indian culture at the Sage Atri Jayanti celebrations held at the Asthana Mandapam in Tirumala on Monday evening.
The programme, observed on the Sravanam star in the Karthika month, was jointly organised by the Vaikhanasa Divya Siddhanta Vivardhini Sabha and TTD’s Alwar Divya Prabandha Projects.
Secretary Sri Deevi Srinivasa Deekshitulu presided. TTD Agama Advisors Sri Archakam Anantha Sayanam Deekshitulu and Sri Khadri Narasimhacharyulu, Vikhanasa Trust Secretary Sri G. Prabhakara Acharyulu, and scholars and students of Sri Venkateswara Veda Vignana Peetham were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
దేవాలయ సంస్కృతికి ఆగమ శాస్త్రాలే ప్రామాణికం
అత్రి మహర్షి జయంతి సభలో పండితుల ఉద్ఘాటన
తిరుమల, నవంబర్ 16: దేవాలయ ఆరాధనా విధానాలు, భారతీయ సంస్కృతి పరిరక్షణలో ఆగమ శాస్త్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పండితులు పేర్కొన్నారు.
కార్తీక మాస శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని అత్రి మహర్షి జయంతి కార్యక్రమాన్ని సోమవారం తిరుమలలోని శ్రీవారి ఆస్థాన మండపంలో వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ, టీటీడీ ఆల్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, వైఖానస భగవచ్ఛాస్త్రం దేవాలయ ఆరాధనా విధానాలకు ప్రామాణికమని, ఆధ్యాత్మిక విలువలు, ధర్మబద్ధమైన జీవన విధానం, సమాజ సంస్కారానికి దోహదపడుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో వైఖానస ఆగమ సంప్రదాయం ఆచరణలో ఉందన్నారు. తిరుమలలో నిర్వహించే పుష్పయాగం కూడా వైఖానస ఆరాధనా విధానంలోని ప్రాయశ్చిత్త ప్రక్రియలో భాగమని వివరించారు.
ఈ కార్యక్రమానికి వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ కార్యదర్శి శ్రీ దీవి శ్రీనివాస దీక్షితులు అధ్యక్షత వహించగా, టీటీడీ ఆగమ సలహాదారులు శ్రీ అర్చకం అనంతశయన దీక్షితులు, శ్రీ ఖాద్రీ నరసింహాచార్యులు, విఖనస ట్రస్ట్ కార్యదర్శి శ్రీ జి. ప్రభాకరాచార్యులు తదితర పండితులు, శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం విద్యార్థులు ప్రసంగించారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.



