AYUDHA PUJA PERFORMED AT MTVAC _ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద సముదాయంలో ఘనంగా ఆయుధపూజ
Tirumala, 19 November 2026: Ayudha Puja was performed ceremoniously at Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex in Tirumala on Thursday. TTD Specified Authority Chairman and Executive Officer Sri Muddada Ravichandra and Additional EO Sri Ch. Venkaiah Chowdhary participated in the programme.
Initially, special pujas were performed to the portraits of Sri Padmavathi and Sri Venkateswara amid Vedic chanting. Pujas were also performed to the machinery and utensils used in the preparation of Annaprasadam. Subsequently, the EO and Additional EO felicitated the Annaprasadam staff.
Speaking on the occasion, Additional EO said that Annaprasadam service is an important part of the pilgrimage to Tirumala, alongside the darshan of Sri Venkateshwara Swamy. He said that approximately Rs. 1,100 crore had been donated to the Annaprasadam Trust over the past two years, with more than 53 per cent of the total donations received by TTD going to the Annaprasadam Trust.
He stated that Annaprasadam is being served to over three lakh devotees on normal days and approximately 4.60 lakh devotees daily during Brahmotsavams. At the Tarigonda Vengamamba Annaprasadam Complex, Annaprasadam is being served to around 90,000 to one lakh devotees every day.
He said that the Annaprasadam initiative, which began in 1985 with just 2,000 devotees, has grown tremendously over the years. The Annaprasadam Trust’s funds have now reached approximately Rs. 3,100 crore. He further stated that steps would be taken to extend Annaprasadam services to all 65 temples under the TTD.
CV&SO Sri Murali Krishna, Annaprasadam Dy EO Sri Rajendra Kumar, Srivari Temple Dy EO Sri Bhaskar, Catering Special Officer Sri Sastry and other officials participated in the programme.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద సముదాయంలో ఘనంగా ఆయుధపూజ
తిరుమల, 2026 నవంబర్ 19: తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో గురువారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ సాధికారిక మండలి చైర్మన్ మరియు ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
ముందుగా వేద మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ పద్మావతి, శ్రీ వేంకటేశ్వరుని చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదాల తయారీకి వినియోగించే యంత్రాలు, పాత్రలకు పూజలు చేశారు. అనంతరం అన్నదానం సిబ్బందిని ఈవో, అదనపు ఈవోలు సన్మానించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, తిరుమలకు వచ్చే భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు అన్నప్రసాద సేవ కూడా యాత్రలో ముఖ్యమైన భాగమన్నారు. గత రెండేళ్లలో అన్నప్రసాద ట్రస్టుకు సుమారు రూ.1,100 కోట్లు విరాళాలు అందాయని, మొత్తం విరాళాల్లో 53 శాతానికి పైగా అన్నప్రసాద ట్రస్టుకే లభించాయన్నారు.
తిరుమలలో సాధారణ రోజుల్లో మూడు లక్షలకు పైగా, బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు సుమారు 4.60 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నట్లు తెలిపారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో రోజుకు 90 వేల నుంచి లక్ష మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
1985లో 2,000 మందితో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం నేడు విశేషంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం అన్నప్రసాద ట్రస్టు నిధులు సుమారు రూ.3,100 కోట్లకు చేరుకున్నాయన్నారు. రాబోయే రోజుల్లో టీటీడీ పరిధిలోని 65 దేవాలయాల్లోనూ అన్నప్రసాద వితరణ అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, అన్న ప్రసాదం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, క్యాంటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.






