TTD LAUNCHES FREE HPV VACCINATION FOR EMPLOYEES’ FAMILIES _ టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్

•  GARDASIL-9 VACCINE TO REDUCE CANCER RISK

  •  FREE VACCINATION FOR ELIGIBLE BENEFICIARIES AGED 9-25 YEARS
  •  2,000 DOSES PROCURED IN THE FIRST PHASE

Tirupati, November 21, 2026: TTD Executive Officer Sri Muddada Ravichandra on Saturday launched a free HPV vaccination programme at the TTD Central Hospital in Tirupati for employees and their family members.

Speaking on the occasion, he said Gardasil-9 vaccines would be provided free of cost to eligible beneficiaries aged 9–25 years. TTD has procured 2,000 doses in the first phase, with more doses to be arranged based on demand.

TTD CMO Dr. Kusuma Kumari said the vaccine helps prevent cervical cancer and other HPV-related cancers and is beneficial for both girls and boys.

Each dose costs TTD around Rs.3,000, compared to the market price of approximately Rs.13,000–14,000 or more.

Deputy EO Sri Ananda Raju, doctors, medical staff, TTD employees and their children participated in the programme.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్

•  క్యాన్సర్ నివారణకు గార్డాసిల్-9 టీకా

•  9 నుంచి 25 ఏళ్లలోపు వారికి ఉచితంగా వ్యాక్సిన్

•  తొలి విడతలో 2,000 డోసుల సేకరణ

•  టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర

తిరుపతి, 2026 నవంబరు 21: టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఉచిత హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తెలిపారు.

తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన ప్రాంగణంలోని సెంట్రల్ ఆసుపత్రిలో శనివారం ఈ కార్యక్రమాన్ని ఈవో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పిల్లలకు అత్యాధునిక గార్డాసిల్-9 వ్యాక్సిన్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. 9 నుంచి 25 ఏళ్లలోపు వారికి ఈ టీకా వేయనున్నట్లు చెప్పారు. తొలి విడతలో 2,000 డోసులను సేకరించామని, అవసరాన్ని బట్టి మరిన్ని డోసులు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.

ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు వారి కుటుంబాల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అర్హులైన ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో క్యాన్సర్ ముప్పు తగ్గింపు

టీటీడీ సీఎంఓ డాక్టర్ కుసుమకుమారి మాట్లాడుతూ, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్‌తో పాటు ఇతర హెచ్‌పీవీ సంబంధిత క్యాన్సర్ల ముప్పును తగ్గించవచ్చని తెలిపారు. బాలికలతో పాటు బాలురకు కూడా ఈ వ్యాక్సిన్ ప్రయోజనకరమని చెప్పారు. హెచ్‌పీవీకి చెందిన తొమ్మిది రకాల వైరస్ వేరియంట్ల నుంచి రక్షణ కల్పించడం గార్డాసిల్-9 ప్రత్యేకత అని వివరించారు.

మార్కెట్ ధర కంటే తక్కువకు సేకరణ.. ఉద్యోగుల పిల్లలకు ఉచితంగా పంపిణీ

గార్డాసిల్-9 వ్యాక్సిన్ ఒక్కో డోసుకు టీటీడీకి రూ.3,000 ఖర్చవుతుండగా, మార్కెట్‌లో దీని ధర సుమారు రూ.13,000 నుంచి రూ.14,000కు పైగా ఉందని అధికారులు తెలిపారు. కంపెనీ నుంచి రాయితీ ధరకు వ్యాక్సిన్లను సేకరించి, టీటీడీ నిధులతో అర్హులైన ఉద్యోగుల పిల్లలకు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు.

వయస్సును బట్టి వ్యాక్సిన్ డోసులు:

•  9 నుంచి 14 ఏళ్లలోపు వారికి: మొదటి డోసు అనంతరం ఆరు నెలలకు రెండో డోసు.

•  15 నుంచి 25 ఏళ్లలోపు వారికి: మొదటి డోసు, రెండు నెలలకు రెండో డోసు, ఆరు నెలలకు మూడో డోసు.

ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో (హెల్త్ అండ్ ఎడ్యుకేషన్) శ్రీ ప్రభల గోపీనాథ్, డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు, వైద్యులు డాక్టర్ శివకుమార్, పారామెడికల్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో టీటీడీ ఉద్యోగులు, వారి పిల్లలు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడింది.