SUCCESSFUL TRIAL RUN OF SRIVARI PADI SARE PROCESSION FROM TIRUMALA TO TIRUCHANOOR _ తిరుమల నుంచి తిరుచానూరుకు శ్రీవారి పడి సారె ఊరేగింపు – ట్రయల్ రన్ విజయవంతం

GRAND ARRANGEMENTS FOR PADMAVATHI AMMAVARI PANCHAMI THEERTHAM

Tirupati, November 25, 2026: TTD is making elaborate arrangements for the annual Karthika Brahmotsavams of Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor from December 6 to 14. TTD JEO Dr A. Sarat said special arrangements are being made for Panchami Theertham, which is expected to attract lakhs of devotees.

On Wednesday, a trial run of the Srivari Padi Sare procession from Tirumala to Tiruchanoor was successfully conducted. Later, the JEO reviewed the Brahmotsavams and Panchami Theertham arrangements with officials at Tholappa Gardens.

He directed all departments to work in coordination and ensure that devotees face no inconvenience.

The JEO said that offering Padi Sare to Goddess Padmavathi on behalf of Lord Venkateswara is a cherished tradition symbolising the sacred bond between Tirumala and Tiruchanoor temples. He invited devotees to witness this divine tradition.

TRIAL RUN OF PADI SARE PROCESSION

The procession trial run began at Sri Vinayaka Swamy Temple in Chennareddy Colony, Tirupati. The Padi Sare was carried on an elephant through Kodandarama Swamy Temple, Small Bazaar Street, Old Huzur Office, Govindaraja Swamy Temple, Anjaneya Swamy Temple, Bandla Street, RTC Bus Stand, Padmavathipuram, Market Yard and Shilparamam, before reaching Pasupu Mandapam at Tiruchanoor and finally Sri Padmavathi Ammavari Temple.

TTD SE (Electrical) Sri Venkateswarlu, Gosala Director Dr Sivakumar, Deputy EOs Sri Harendranath, Smt Shanti and Sri Sivaprasad, VGO and Additional Health Officer Dr Sunil Kumar, among others, participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమితీర్థం – పటిష్ట ఏర్పాట్లు

తిరుమల నుంచి తిరుచానూరుకు శ్రీవారి పడి సారె ఊరేగింపు – ట్రయల్ రన్ విజయవంతం

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలి

టీటీడీ జేఈవో డా. ఏ. శరత్

తిరుపతి, 2026 నవంబరు 25: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు టీటీడీ జేఈవో డా. ఏ. శరత్ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన పంచమితీర్థానికి లక్షలాది మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో బుధవారం తిరుమల నుంచి తిరుచానూరుకు శ్రీవారి పడి సారెను తీసుకువచ్చే ఊరేగింపు మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం తిరుచానూరులోని తోళప్ప గార్డెన్స్‌లో అధికారులతో సమావేశమై బ్రహ్మోత్సవాలు, పంచమితీర్థం ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరఫున తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పించే పడి సారె మన ప్రాచీన ధార్మిక సంప్రదాయాలకు, తిరుమల–తిరుచానూరు ఆలయాల మధ్య ఉన్న పవిత్ర అనుబంధానికి ప్రతీక అని తెలిపారు. ఈ అపురూపమైన ఆధ్యాత్మిక ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు.

శ్రీవారి సారె ఊరేగింపు మార్గంలో ట్రయల్ రన్

తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో ఉన్న శ్రీ వినాయకస్వామివారి ఆలయం నుంచి శ్రీవారి పడి సారె ఊరేగింపు ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఏనుగుపై సారెను తీసుకువెళుతూ శ్రీ కోదండరామాలయం, చిన్నబజారు వీధి, పాత హుజూర్ కార్యాలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం, బండ్ల వీధి, ఆర్టీసీ బస్టాండ్, పద్మావతిపురం, మార్కెట్ యార్డు, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని పసుపు మండపానికి చేరుకున్నారు.

అక్కడి నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. 

ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్ఈ (ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, గోశాల డైరెక్టర్ డాక్టర్ శివకుమార్, డిప్యూటీ ఈవోలు శ్రీ హరేంద్రనాథ్, శ్రీమతి శాంతి, శ్రీ శివప్రసాద్, విజివో  శ్రీ, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది