COMMAND CONTROL RECOVERS DEVOTEE’S GOLD WITHIN HOURS _ కమాండ్ కంట్రోల్ చాకచక్యం.. భక్తునికి తిరిగి దక్కిన బంగారం

VIGILANCE AND SECURITY OFFICERS AND STAFF PRAISED

Tirumala, November 28, 2026: About 60 grams of gold jewellery lost by a devotee was recovered by the Tirumala Command Control team and returned to him within hours.

Sri G. Mahesh of Madanapalle, Annamayya district, accidentally dropped the jewellery while getting out of a car at the CRO Office bus stop around 4:30 PM on November 27. He realised it only later and contacted Command Control.

Staff checked CCTV footage and found that two people had picked up the jewellery. Using playback, they traced the first person, a devotee from Tiruvannamalai, and called him to Tirumala. Two gold chains and a bracelet, about 52 grams in all, were recovered from him at 4:30 AM on November 28. The second person was tracked to Narayanagiri Shed No. 7, where a gold ring of about 8 grams was recovered at 5:30 AM.

The full 60 grams was handed over to Sri Mahesh at 6:30 AM. Delighted, he recorded a video message in the feedback register.

On the orders of TTD CVSO Sri K.V. Muralikrishna, devotees appreciated VGO Sri Surendra, AVSO Sri Venkataramana, other officials and the Command Control staff for their efforts.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

కమాండ్ కంట్రోల్ చాకచక్యం.. భక్తునికి తిరిగి దక్కిన బంగారం

CCTV పర్యవేక్షణతో 60 గ్రాముల బంగారు ఆభరణాల రికవరీ

విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు, సిబ్బందికి ప్రశంసలు 

•  పోగొట్టుకున్న సుమారు 60 గ్రాముల బంగారు ఆభరణాలు కొద్ది గంటల్లోనే స్వాధీనం

•  CCTV ప్లేబ్యాక్ ద్వారా ఇద్దరిని గుర్తించిన తిరుమల కమాండ్ కంట్రోల్ సిబ్బంది

•  ఆభరణాలు అందుకున్న భక్తుని ఆనందం వీడియో రూపంలో ఫీడ్‌బ్యాక్ రిజిస్టర్‌లో నమోదు

తిరుమల, 2026 నవంబరు 28: అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన భక్తుడు శ్రీ జి. మహేష్  పోగొట్టుకున్న సుమారు 60 గ్రాముల బంగారు ఆభరణాలను తిరుమల కమాండ్ కంట్రోల్ సిబ్బంది అత్యంత చాకచక్యంగా తిరిగి రికవరీ చేసి, ఆయనకు అందజేశారు.

కారు దిగే తొందరలో జారిన ఆభరణాలు

27-11-2026 సాయంత్రం సుమారు 4:30 గంటలకు శ్రీ మహేష్ కారులో ప్రయాణిస్తూ, CRO ఆఫీస్ బస్ స్టాప్ వద్ద అత్యవసరంగా దిగే సమయంలో తన వద్ద ఉన్న సుమారు 60 గ్రాముల బంగారు ఆభరణాలను పొరపాటున జారవిడిచారు. ఆ సమయంలో ఆయన దీన్ని గమనించలేదు. కొద్దిసేపటి తరువాత ఆభరణాలు పోయినట్లు గుర్తించి, వెంటనే తిరుమల కమాండ్ కంట్రోల్‌ను సంప్రదించారు.

CCTV ఫుటేజ్‌తో వేగంగా గుర్తింపు

కమాండ్ కంట్రోల్ సిబ్బంది వెంటనే సంబంధిత ప్రాంతంలోని CCTV ఫుటేజ్‌ను పరిశీలించి, ఇద్దరు వ్యక్తులు ఆ ఆభరణాలను తీసుకున్నట్లు గుర్తించారు.

మొదటి వ్యక్తి నుంచి 52 గ్రాముల రికవరీ

CCTV ప్లేబ్యాక్ ద్వారా మొదటి వ్యక్తి తిరువణ్ణామలైకు చెందిన భక్తుడని గుర్తించి, అతని లగేజీ వివరాలు సేకరించారు. ఆభరణాలు మరొక భక్తునివని ఫోన్ ద్వారా తెలియజేసి, అతడిని తిరువణ్ణామలై నుంచి తిరుమలకు రప్పించారు. అతని వద్ద ఉన్న రెండు బంగారు గొలుసులు, ఒక బంగారు బ్రాస్‌లెట్ (మొత్తం సుమారు 52 గ్రాములు) 28-11-2026 ఉదయం 4:30 గంటలకు స్వాధీనం చేసుకున్నారు.

రెండో వ్యక్తి నుంచి 8 గ్రాముల రికవరీ

రెండో వ్యక్తి ఉచిత దర్శనానికి వెళ్లినట్లు CCTV ద్వారా గుర్తించారు. ప్లేబ్యాక్ సహాయంతో అతని కదలికలను ట్రాక్ చేయగా, అతను నారాయణగిరి షెడ్ నంబర్-7లో ఉన్నట్లు తెలిసింది. అతని వద్ద ఉన్న సుమారు 8 గ్రాముల బంగారు ఉంగరాన్ని అదే రోజు ఉదయం 5:30 గంటలకు స్వాధీనం చేసుకున్నారు.

రికవరీ చేసిన ఆభరణాల వివరాలు

•  బంగారు ఉంగరం – 1 (సుమారు 8 గ్రాములు)

•  బంగారు గొలుసులు – 2

•  బంగారు బ్రాస్‌లెట్ – 1

•  మొత్తం: సుమారు 60 గ్రాములు

భక్తునికి అప్పగింత.. 

కమాండ్ కంట్రోల్ సిబ్బంది నిరంతర CCTV పర్యవేక్షణ, ప్లేబ్యాక్ విశ్లేషణ, సమన్వయంతో ఆభరణాలను రికవరీ చేసి, 28-11-2026 ఉదయం 6:30 గంటలకు శ్రీ జి. మహేష్ కు అప్పగించారు. విలువైన ఆభరణాలు తిరిగి లభించడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేసిన భక్తుడు, తన ఆనందాన్ని వీడియో రూపంలో ఫీడ్‌బ్యాక్ రిజిస్టర్‌లో నమోదు చేశారు.

భక్తుల భద్రతకు, వారి విలువైన వస్తువుల పరిరక్షణకు తిరుమల కమాండ్ కంట్రోల్ CCTV వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతోందనడానికి ఈ సంఘటన మరో నిదర్శనం.

టిటిడి సివిఎస్వో శ్రీ కే వి మురళీకృష్ణ ఆదేశాల మేరకు 

భక్తుడు పొగొట్టుకున్న బంగారు నగలును తిరిగి అప్పగించేందుకు కృషి చేసిన టిటిడి విజివో శ్రీ సురేంద్ర, ఏవీఎస్వో శ్రీ వెంకటరమణ, ఇతర అధికారులు, కమాండ్ కంట్రోల్ సిబ్బందిని భక్తులు అభినందించారు. 

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.