NARAYANADASU UTSAVAMS COMMENCE_ ఘనంగా శ్రీ ఆదిభట్ల నారాయణదాస జయంతి ఉత్సవాలు ప్రారంభం

Tirumala, 20 August 2017: Harikatha Pitamaha Srimadajjada Narayanadasu 153rd Birth Anniversary celebrations commenced in Mahati auditorium on Sunday evening.

Speaking on this occasion CVSO Sri A Ravikrishna said Sri Narayanadasu brought the world wide acclaim to Telugu through Harikatha and popularised namasankeerthana.

Special Officer Sri N Muktheswara Rao said Narayanadasu through his versatality brought importance through Harikatha.

Later Harikatha Parinayam on Prahlada Charitra was presented by renowned Harikatha artist Sri Dhulipalla Sivaramakrishna.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఘనంగా శ్రీ ఆదిభట్ల నారాయణదాస జయంతి ఉత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2017 ఆగస్టు 20: హరికథా పితామహునిగా వినుతికెక్కిన శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాస 153వ జయంతి ఉత్సవాలు తిరుపతి లోని మహతి ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి నారాయణదాస చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు.

ఈ సందర్భంగా విజయవాడకు చెందిన శతావధాని డా.. పాలపర్తి శ్యామలానందప్రసాద్ “నారాయణదాస తెలుగు అనువాద లలితాసహస్రనామం తల్లివిన్కి” అనే అంశంపపై పత్ర సమర్పణ చేశారు. లలితాసహస్రనామం విశిష్టత ను తెలుగు వారందరూ అర్థం చేసుకునేలా అనువదించారని వివరించారు. నారాయణదాస ఎన్నో తెలుగు పదాలకు జీవం పోశారని‌, 1500 పదాలతో అచ్చ తెలుగు పదాలతో నిఘంటువును రూపొందించారని తెలిపారు.

టిటిడి సివిఎస్వో శ్రీ ఆకె ‌రవికృష్ణ మాట్లాడుతూ నారాయణదాస వారు తెలుగు భాషకు ప్రపంచ ఖ్యాతి తెచ్చారని తెలిపారు. కలియుగంలో నామసంకీర్తన వైశిష్ట్యాన్ని తెలియజేశారని, సమాజానికి చక్కటి ధార్మిక సందేశాన్ని అందించారని వివరించారు.

టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్.ముక్తేశ్వరరావు మాట్లాడుతూ హరికథ ప్రాచుర్యానికి నారాయణదాస విశేష కృషి చేశారని తెలిపారు. సంగీతం, సాహిత్యం, నాట్యం, అభినయం కలిపి హరికథను సమాహారకళగా తీర్చిదిద్దారని వివరించారు.

ఈ సందర్భంగా శ్రీ రాజశేఖరుని లక్ష్మి పతిరావు భాగవతులు రచించిన “గోదాదేవి కల్యాణము(హరికథ)” గ్రంథాన్ని సివిఎస్వో ఆవిష్కరించారు. అనంతరం అతిథులను శాలువ, శ్రీవారి ప్రసాదంతో సన్మానించారు.

ఆ తరువాత గుంటూరుకు చెందిన శ్రీ ధూళిపాల శివరామకృష్ణ ప్రహ్లాద చరిత్ర హరికథా గానం చేశారు.

ఈ కార్యక్రమంలో హెచ్ డిపిపి కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, టిటిడి డిఈవో శ్రీ రామచంద్ర, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి వైవిఎస్ పద్మావతి, హరికథా విభాగాధిపతి శ్రీ ఎంవి.సింహాచలశాస్త్రి, అధ్యాపకులు శ్రీ వెంకటేశ్వర్లు ఇతర అధ్యాపకులు, విద్యార్థులు, నగరవాసులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.