“A DREAM COME TRUE FOR PEOPLE OF MAHARASHTRA”-MAHA CM SRI EKNATH SHINDE _ తిరుమల బాలాజి మహారాష్ట్ర వాసులను ఆశీర్వదించడానికి వచ్చారు : మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే 

“TIRUMALA TEMPLE TO BE REPLICATED IN NAVI MUMBAI”-TTD CHAIRMAN SRI YV SUBBA REDDY

“FORTUNATE TO BE A PART IN THIS DIVINE MISSION BEING AN ARDENT DEVOTEE OF BALAJI”-RAYMONDS GROUP CMD GAUTAM HARI SINGHANIA

BHOOMI POOJA FOR SRI VENKATESWARA BALAJI TEMPLE HELD 

MUMBAI, 07 JUNE 2023: “it’s a long pending dream come true for the people of Maharastra as very soon Tirupati Sri Venkateswar Balaji temple is going to come up in Navi Mumbai to bless all of us”, said the Honourable CM of Maharastra Sri Eknath Sambhaji Shinde.

The Bhoomi Pooja event for the construction of Sri Venkateswara (Balaji) temple took place in the 10 acres of land allotted by the Government of Maharashtra in Ulve at Navi Mumbai on Wednesday. The Honourable Chief Minister Sri Eknath Shine along with the Deputy CM Sri Devender Fadnavis took part in the auspicious event. 

Later the media persons were briefed about the upcoming temple. The CM of Maharastra commenced his conference chanting “Venkatramana Govinda”. Today is a very memorable day for our Maharashtra, as the replica of Tirupathi  Balaji mandir is being constructed in Navi Mumbai soon. Not everybody is fortunate enough to visit Balaji in Tirumala. So the upcoming temple will resolve this longing desire of the people of Maharastra to have darshan of Sri Balaji Venkateswar in Mumbai itself”.

Adding further he said, “One more thing is that the 22km longest single bridge of Mumbai Trans harbour link which is coming up shortly is getting connected to Mahalakshmi temple. All these works are taking place with the blessings of Lord Venkateswar. We extend our complete cooperation on behalf of the Government of Maharastra towards the speedy completion of the Balaji temple in Navi Mumbai. I would like to thank TTD Trust Board Chairman, members, officials, Donor, our officials and everyone who have been associated with this divine task”, he maintained.

Sri YV Subba Reddy, the Chairman of TTD Trust Board said, On this occasion, I would like to extend my special thanks to the Honourable Chief Minister of Andhra Pradesh Sri Y.S. Jaganmohan Reddy who has advised us to construct a massive temple of Lord Balaji akin to Tirumala temple as it is a longing desire of the people of Maharastra. The temple plan is ready and the CMD of Raymond Group Sri Gautam Hari Singhania has come forward to donate Rs.60-75cr towards the construction of the temple on donation. Besides the temple, Pushkarini (Sacred Temple Water Tank for taking holy dip), Alankara Mandapam (Ritual Hall), Ratha Mandapam, Vahana Mandapam and Four Mada Streets encircling the shrine would also be constructed similar to Tirumala. The entire structure will be built with stone sculpture. This temple will become a reality in Navi Mumbai in less than two years. I thank the Honourable CM Sri Eknath Shinde ji and Deputy CM Sri Devernder Fadnavis ji, the donor Sri Singhania ji and former minister Sri Aditya Thackeray who took the initiative in the allotment of land towards the construction of Sri Balaji temple in Navi Mumbai, he added. 

Speaking to the media, Sri Gautam Singhania said, “It’s a very happy day for me. I have been visiting Tirumala Balaji temple from the past five decades and I am grateful that we are given an opportunity to construct a temple of Lord Venkateswara in Mumbai. This temple will do tremendous good to the people of Maharastra. With the support of everyone we will build this temple with great speed. I thank everyone for giving me this divine opportunity”. 

TTD Executive Officer Sri AV Dharma Reddy, Trust Board members Sri Milind Narvekar, Sri Amol Kale, Sri Rajesh Sharma, Sri Saurabh Bora, CIDCO VC and MC Dr Sanjay Mukherjee, many other IAS and IPS officers and other officials from Government of Maharastra, Superintending Engineer of TTD Sri Jagadeeshwar Reddy and many other officers from TTD were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుమల బాలాజి మహారాష్ట్ర వాసులను ఆశీర్వదించడానికి వచ్చారు : మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే

– తిరుమల ఆలయ తరహాలోనే నవీ ముంబైలో శ్రీ బాలాజి ఆలయం : టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

– దివ్య కార్యంలో భాగం కావడం నా అదృష్టం : రేమండ్స్ గ్రూప్ సీఎండీ
శ్రీ గౌతమ్ హరి సింఘానియా

-. ముంబై లో శ్రీ బాలాజి ఆలయ నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమి పూజ

తిరుపతి, 7 జూన్ 2023: మహారాష్ట్ర ప్రజల చిరకాల కోరికను నెరవేర్చి మనల్ని ఆశీర్వదించడానికి తిరుమల బాలాజి నవీ ముంబై లో కొలువుదీర బోతున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే సంతోషం వ్యక్తం చేశారు.

నవీ ముంబైలోని ఉల్వేలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో శ్రీవేంకటేశ్వర (బాలాజి ) ఆలయ నిర్మాణానికి బుధవారం శాస్త్రోక్తంగా భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండేతో పాటు, డెప్యూటీ సిఎం శ్రీ దేవేందర్ ఫడ్నవీస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ షిండే ఆలయ విశేషాలను మీడియా ప్రతినిధులకు వివరించారు. అనంతరం సిఎం “వెంకటరమణ గోవిందా” అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నవీ ముంబైలో తిరుపతి బాలాజి మందిర నిర్మాణానికి శంఖు స్థాపన జరిగిన ఈ రోజు మహారాష్ట్రకు మరపురాని రోజు అన్నారు. తిరుమలలో బాలాజిని దర్శించుకునే అదృష్టం అందరికీ ఉండదన్నారు. రాబోయే రోజుల్లో ముంబైలోనే శ్రీ బాలాజి (వేంకటేశ్వరుని) దర్శనం చేసుకునే అదృష్టం మహారాష్ట్ర ప్రజలకు లభించబోతోందని చెప్పారు.

ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌లోని 22 కిలోమీటర్ల పొడవైన సింగిల్ బ్రిడ్జి త్వరలో మహాలక్ష్మి ఆలయానికి అనుసంధానించబడుతోందన్నారు. ఈ పనులన్నీ శ్రీ బాలాజి ఆశీర్వాదంతో జరుగుతున్నాయన్నారు. నవీ ముంబైలోని శ్రీ బాలాజి ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సిఎం చెప్పారు. టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులు, అధికారులు, దాతలు, మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, మహారాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అయిన బాలాజి ఆలయాన్ని తిరుమల ఆలయం తరహాలో నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి సూచించారన్నారు. ఇందుకు అవసరమైన ఆలయ నిర్మాణ ప్రణాళిక సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు . ఆలయ నిర్మాణం ఖర్చు మొత్తం భరించడానికి రేమండ్ గ్రూప్ సిఎండి శ్రీ గౌతమ్ హరి సింఘానియా ముందుకు వచ్చారని వివరించారు. రెండేళ్ళలో ఆలయ నిర్మాణం పూర్తి చేసి భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తామని చెప్పారు.

శ్రీ గౌతమ్ సింఘానియా మాట్లాడుతూ, ఇది తనకు చాలా సంతోషకరమైన రోజని చెప్పారు. తాను ఐదు దశాబ్దాలుగా తిరుమల బాలాజిని దర్శిస్తున్నానని చెప్పారు. ముంబైలో శ్రీ బాలాజి ఆలయాన్ని నిర్మించే అదృష్టం స్వామి తనకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆలయం మహారాష్ట్ర ప్రజలకు ఎంతో ఆధ్యాత్మిక ఆనందం పంచుతుందని ఆయన చెప్పారు. అందరి సహకారంతో ఆలయాన్ని అత్యంత వేగంగా నిర్మిస్తామన్నారు.

టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మా రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ మిలింద్ నర్వేకర్ , శ్రీ అమోల్ కాలే, శ్రీ రాజేష్ శర్మ, శ్రీ సౌరభ్ బోరా, సిడ్కో విసి డాక్టర్ సంజయ్ ముఖర్జీ, టీటీడీ ఎస్ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పలువురు టీటీడీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.