A RECORD 1.1LAKH DEVOTEES SERVED ANNAPRASADAM _ 1.10 లక్షల‌ మందికి అన్నప్రసాదాలు, అల్పాహారం

Tiruchanoor, 1 Dec. 19:A record number of 1.10lakh devotees were served Annaprasadam on the occasion of Panchami Theertham on Sunday at Tiruchanoor.

The Navahnika brahmotsavams culminated with Panchami Theertham. A sea of humanity congregated to take part in this most auspicious ritual from different parts of AP and Tamilnadu.

TTD has set up 160 food courts to serve Annaprasadam to the scores of devotees while over 1.5lakh water bottles have been served.

The sanitation wing has deployed 600 workers to attend to the cleaning work.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

పంచమీ తీర్థం నాడు 1.10 లక్షల‌ మందికి అన్నప్రసాదాలు, అల్పాహారం

తిరుప‌తి, 2019 డిసెంబ‌రు 01 ;తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి పంచమితీర్థ మహోత్సవం సంద‌ర్భంగా టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో 1.10 లక్షల‌ మంది భక్తులకు అన్నప్రసాదాలు, అల్పాహారం  అందించారు.

 భ‌క్తుల సౌక‌ర్యార్థం తోళ‌ప్ప గార్డెన్స్‌లో 50, జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్ వ‌ద్ద 40, శ్రీ అయ్య‌ప్ప‌స్వామివారి  ఆల‌యం వ‌ద్ద 50, మామిడి కాయ‌ల మార్కెట్ వ‌ద్ద 20 అన్న‌ప్ర‌సాదం కౌంట‌ర్ల‌లో భక్తులకు కదంబం, చక్కెర పొంగళి, దధ్యోధనం, పులిహోర‌ అందజేశారు. శ్రీ‌వారి సేవ‌కులు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌లో పాల్గొన్నారు. అన్నప్రసాద విభాగం ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి పార్వ‌తి, క్యాట‌రింగ్ అధికారి శ్రీ సాయిబాబారెడ్డి అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు.

దాదాపు 1.50  లక్షల తాగునీటి బాటిళ్ల పంపిణీ

పంచమితీర్థం సందర్భంగా విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు టిటిడి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో దాదాపు 1.50 లక్షల తాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు. ఆలయం, పుష్కరిణి పరిసరాల్లో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచారు. భక్తుల సౌకర్యార్థం 300 శాశ్వ‌త, తాత్కాలిక, మొబైల్‌ మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 300 మంది, పంచమితీర్థం రోజున 600 మంది పారిశుద్ధ్య సిబ్బంది సేవలందించారు. టిటిడి అద‌న‌పు ఆరోగ్య‌శాఖాధికారి డా. సునీల్‌, యూనిట్ అధికారి శ్రీ అమ‌ర‌నాథ‌రెడ్డి ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.