AADHAAR MANDATORY FOR VIP BREAK UNDER DISCRETIONARY QUOTA FROM JULY 11_ జూలై 11 నుంచి బ్రేక్ దర్శనాలకు ఆధార్ తప్పనిసరి
Tirumala, 10 July 2017: To have more transparency, TTD is set to make Aadhaar Mandatory for VIP Break Darshan tickets issued under discretionary quota, which will come into force from July 11on wards.
The authorities of temple management of Tirumala Tirupati Devasthanams (TTD) are finding all the ways and means to give the transparent darshan to visiting pilgrims. TTD has brought many revolutionary changes in recent times in different modes of darshan to ensure best possible darshan to its pilgrims. As a part of this measure, TTD has decided to insist Aadhaar card for applying VIP break darshan ticket with effect from July 11. Initially Aadhaar will be made mandatory to the applicant and slowly extended to other members.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జూలై 11 నుంచి బ్రేక్ దర్శనాలకు ఆధార్ తప్పనిసరి
తిరుమల, 2017, జూలై 10.: తిరుమలలో బ్రేక్ దర్శనాలకు దరఖాస్తు చేసుకునే భక్తులు జూలై 11వ తేదీ నుంచి తప్పనిసరిగా ఆధార్‌కార్డు జిరాక్స్‌ను జత చేయాలని టిటిడి సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
బ్రేక్ దర్శనాల జారీలో మరింత పారదర్శకత పెంచేందుకు టిటిడి ఈ మేరకు చర్యలు చేపట్టింది. బ్రేక్ దర్శనానికి వచ్చే సమయంలో భక్తులు ఆధార్‌ను వెంట తీసుకురావాలని కోరింది. కాగా ప్రస్తుతం బ్రేక్ దర్శనానికి దరఖాస్తు చేసే వ్యక్తి ఆధార్ సమర్పించాలని, వారితోపాటు వచ్చే మిగిలిన భక్తులకు కూడా త్వరలో ఆధార్ ను తప్పనిసరి చేస్తామని టిటిడి తెలియజేసింది.
అదేవిధంగా, తిరుమలలో శ్రీవారి దర్శనం, బస, లడ్డూ ప్రసాదం తదితర సేవల్లో మరింత పారదర్శకత పెంచేందుకు, భద్రతాపరమైన ఇబ్బందులు రాకుండా చూసేందుకు భక్తులు ఆధార్‌ను వినియోగించి సహకరించాలని టిటిడి కోరుతోంది
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.