AARADHANA MAHOTSAVAMS OF SRI JAYATHEERTHACHARYA COMMENCES

Tirumala, 13 Jul. 17: The three-day Aaradhana Mahotsavams of Sri Jayatheerthacharya, the renowned Hindu philosopher and the sixth pontiff of Madhvacharya Peetha commenced at Asthana Mandapam in Tirumala under the aegis of Dasa Sahitya Project of TTD on Thursday.

Pontiffs hailing from Udipi Sri Raghuvarendrateertha Swamiji, Kokke Subrahmanya mitt’s Sri Vidya Prasanna Teertha Swamiji rendered Anugraha Bhashana.

Scores of Dasaparas took part in this fete. Arrangements were made under the supervision of the project officer Dr PR Anandatheerthacharyulu.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమలలో ప్రారంభమైన జయతీర్థుల ఆరాధన మహోత్సవాలు

జూలై 13, తిరుమల, 2017: తిరుమలలోని ఆస్థానమండపంలో టి.టి.డి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ జయతీర్థుల ఆరాధన మహోత్సవాలు గురువారంనాడు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా ఉడిపికి చెందిన శ్రీశ్రీశ్రీ రఘువరేంద్రతీర్థ స్వామీజీ, కొక్కె సుబ్రహ్మణ్య క్షేత్రానికి చెందిన శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు అందించారు. సుమారు 3000 మందికి పైగా దాస భక్తులు ఈ ఆరాధన మహోత్సవాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| పి.ఆర్‌ ఆనందతీర్థాచార్య పర్యవేక్షించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.