ABHISHEKAM HELD WITH CROSSANDRA _ ఆకాశ‌గంగా శ్రీ బాలాంజ‌నేయ‌స్వామి ఆల‌యంలో వైభవంగా క‌న‌కాంబ‌రం పుష్పాల‌తో విశేష‌ అభిషేకం

Tirumala, 03 June 2024: Special Abhishekam to Sri Balanjaneya Swamy along with Anjana Devi with Crossandra-Kanakambarm was held on Monday.

The archakas chanted Sahasranamam while performing this special Abhishekam on the third day of Hanuman Jayanti fete at Anjanadri Akasaganga.

Temple officials, devotees were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆకాశ‌గంగా శ్రీ బాలాంజ‌నేయ‌స్వామి ఆల‌యంలో వైభవంగా క‌న‌కాంబ‌రం పుష్పాల‌తో విశేష‌ అభిషేకం

తిరుమ‌ల‌, 2024 జూన్ 03: తిరుమ‌ల‌లో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆంజ‌నేయ‌స్వామి జ‌న్మ స్థ‌ల‌మైన ఆకాశ‌గంగ‌లో శ్రీ అంజ‌నాదేవి స‌మేత శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యంలో సోమ‌వారం ఉద‌యం స్వామివారికి ఎంతో ప్రీతి పాత్ర‌మైన‌ క‌న‌కాంబ‌రం, సింధూర వ‌ర్ణ‌ గ‌న్నేరి పుష్పాల‌తో విశేష సహస్ర నామార్చనను అర్చకులు నిర్వహించారు.

ఈ సందర్భంగా టీటీడీ వైఖాన‌స ఆగ‌మ‌స‌ల‌హాదారు శ్రీ మోహ‌న‌రంగాచార్యులు ఆంజ‌నాద్రి, ఆకాశగంగ శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి జ‌న్మ‌స్థ‌లం మ‌రియు స్వామివారి వైభ‌వం గురించి వివరించారు. అనంతరం స్వామివారికి పంచామృత స్న‌ప‌న తిరుమంజ‌నం జరిగింది.

ఈ కార్య‌క్ర‌మాల్లో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.