ACCOMMODATION TO SELF DONORS DURING BTUs _ శ్రీవారి బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు గదుల కేటాయింపు

Tirumala, 25 August 2018: As the annual Brahmotsavams and Navarathri Brahmotsavams are scheduled in the months of September and October respectively, accommodation booking is enabled in online only to self donors.

The booking option will be disabled for others in Cottage Donor Management Scheme(CDMS) for others during the two brahmotsvams. Even for self donors, the booking option is disabled from September 15 to 17 and also from October 12th to 14 in view of Garuda Seva during the two brahmotsavams.

Self donors who have single room or two rooms in a same building are permitted to avail accommodation in any of the two days continuously once at a time avoiding the blockage dates and similarly the self donors who have more than two rooms can avail two rooms continuously once at a time only avoiding blockage dates keeping in view the Garuda Seva.

The donors are requested to make note of the above changes made by TTD in view of annual brahmotsavams and co-operate with the management.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు గదుల కేటాయింపు

ఆగస్టు 25, తిరుమల 2018 ; శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయించడం జరుగుతుంది. తిరుమలలో సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దాతలు cdms.ttdsevaonline.com వెబ్‌సైట్‌ ద్వారా గదులను రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది.

సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సెప్టెంబరు 17న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 15 నుండి 17వ తేదీ వరకు కాటేజి దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదు.

అదేవిధంగా, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 14న గరుడసేవ సందర్భంగా అక్టోబరు 12 నుండి 14వ తేదీ వరకు కాటేజి దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదు.

ఒకే కాటేజిలో రెండు గదుల కంటే ఎక్కువగా విరాళంగా ఇచ్చిన దాతలకు రెండు గదులను రెండు రోజుల పాటు కేటాయిస్తారు. ఒకే కాటేజిలో ఒక గదిని విరాళంగా ఇచ్చిన దాతలకు ఒక గదిని రెండు రోజులపాటు కేటాయించడం జరుగుతుంది. ఈ విషయాన్ని కాటేజి దాతలు గమనించాలని టిటిడి కోరుతోంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.