ACHIEVED QUALITY PROGRAMS WITH EFFICIENT TTD EMPLOYEES -Dr KS JAWAHAR REDDY _ సమర్థులైన ఉద్యోగులు ఉండడంతో తక్కువ వ్యవధిలో ఎక్కువ కార్యక్రమాలు : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి
Tirumala, 08 May 2022: The outgoing EO Dr KS Jawahar Reddy on Sunday said that he could achieve many programs with the support by efficient and dedicated TTD employees during his tenure of 19 months.
He was addressing a farewell function at Annamaiah Bhavan on Sunday evening and shared his experiences with officers.
He said he was blessed with the opportunity to serve in TTD by Sri Venkateswara Swamy only now and earlier he had sphere headed Pushkaras which came once in 12 years and also handled relief activities during pandemic Covid.
He said his experience in TTD was exciting with issues of temple administration and handling Archaka system. Besides Brahmotsavam, Vaikunta Ekadasi Dwara Darshanam for ten days, Organic Srivari naivedyam, Gosamrakshana etc.
He asked officials to prepare a document on Srivari temple, kalyana katta reception, Annaprasadam, security etc. which could be source of backup information for upcoming officials and EOs. He urged for taking up, mechanised cleaning of ghat roads and completion of Vengamamba Dhyana Mandiram at Tirumala.
Earlier he also participated in a special farewell meeting organised by local media representatives and discussed several issues with them.
TTD EO (FAC) Sri AV Dharna Reddy, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, SVBC CEO Sri Suresh Kumar, CE Sri Nageswara Rao, FA&CAO Sri O Balaji were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
సమర్థులైన ఉద్యోగులు ఉండడంతో తక్కువ వ్యవధిలో ఎక్కువ కార్యక్రమాలు : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి
మే 08, తిరుమల, 2022: టిటిడిలో సమర్థులైన ఉద్యోగులు ఉండడంతో 19 నెలల తక్కువ వ్యవధిలో ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించగలిగానని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆదివారం సాయంత్రం ఈవో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈవో తన అనుభవాలను పంచుకుని అధికారులకు పాలనలో మెళకువలను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ టిటిడి ఈవోగా వచ్చేందుకు కొన్నేళ్ల ముందే ప్రయత్నించానని, స్వామివారు ఇప్పుడు అవకాశం ఇచ్చారని చెప్పారు. ఎన్నికల్లో పనిచేసే అవకాశంతోపాటు 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లోను, వందేళ్లకు ఒకసారి వచ్చిన కోవిడ్ మహమ్మారి లాంటి అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల కోసం పనిచేశానని తెలిపారు. భగవంతుని దయతో ఎంతటి కష్టమైన పని అయినా చేయగలిగానన్నారు. టిటిడి పాలన కాస్త భిన్నమైనదని, ఆలయ వ్యవహారాలు, అర్చక వ్యవస్థ కొత్త అనుభూతిని ఇచ్చాయని చెప్పారు. స్వామివారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తులకు సేవలందించడం మరిచిపోలేని అనుభూతి అని తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలతోనే మనుగడ సాధ్యమని, గోసంరక్షణ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెంచాలని సూచించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా పేద వర్గాల వారికి స్వామివారి దర్శనం చేయించడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు.
ముఖ్యంగా శ్రీవారి ఆలయం, కల్యాణకట్ట, రిసెప్షన్, అన్నదానం, భద్రత తదితర ముఖ్యమైన విభాగాలకు సంబంధించి డాక్యుమెంట్ తయారు చేయాలని, కొత్తగా వచ్చే అధికారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. ఘాట్ రోడ్లలో మెకనైజ్డ్ క్లీనింగ్, వెంగమాంబ ధ్యానమందిరం పూర్తి చేయాలని కోరారు.
అంతకుముందు మీడియా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో ఈవో పాల్గొన్నారు. వివిధ అంశాలకు సంబంధించి వారితో ముచ్చటించారు.
ఆత్మీయ సమావేశంలో టిటిడి ఈవో(ఎఫ్ఏసి) శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవోలు శ్రీమతి భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్‌కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వర రావు, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.