ADDITIONAL EO INSPECTS VARIOUS DEVELOPMENT WORKS _ తిరుమలలో పలు అభివృద్ధి పనులను తనిఖీ చేసిన అదనపు ఈవో
Tirumala, 12 Sep. 20: The Additional EO Sri AV Dharma Reddy on Saturday evening inspected the ongoing development works at different places in Tirumala along with Chief Engineer Sri M Ramesh Reddy.
As part of it, he visited Road extension works at MBC, new Parakamani building works and instructed the officials concerned to speed up the works.
SE 2 Sri Nageswara Rao, EE 1 Sri Jaganmohan Reddy, Temple DyEO Sri Harindranath, VGO Sri Manohar were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో పలు అభివృద్ధి పనులను తనిఖీ చేసిన అదనపు ఈవో
తిరుమల, 2020 సెప్టెంబరు 12: తిరుమలలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ అదనపు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి శనివారం సాయంత్రం చీఫ్ ఇంజనీర్ శ్రీ ఎం.రమేష్ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు.
ఎంబిసి ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు, అన్నప్రసాద భవనం ఎదురుగా జరుగుతున్న నూతన పరకామణి భవనం పనులను తనిఖీ చేశారు. పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
అదనపు ఈవో వెంట ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వర రావు, ఈఈ-1 శ్రీ జగన్మోహన్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, విజివో శ్రీ మనోహర్ తదితరులు ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.