ADDITIONAL EO INSPECTS VEDIC SADAS ARRANGEMENTS AT DHARMAGIRI _ అఖిల‌భార‌త వేదశాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సు ఏర్పాట్ల‌పై అద‌న‌పు ఈవో స‌మీక్ష‌

VEDA AGAMA VIDWAT SADAS TO BE OBSERVED FROM FEB 25 TO MARCH 1

750 VEDIC STUDENTS AND 125 VEDIC PUNDITS TO PARTCIPATE FROM ACROSS THE COUNTRY

Tirumala, 17 Feb. 20: As the six-day long Sri Venkateswara Veda Sastra Agama Vidwat Sadas is all set to take part from February 25 till March 1 at Sri Venkateswara Veda Vignana Peetham at Vedagiri in Tirumala, the Additional EO Sri AV Dharma Reddy along with officials inspected the ongoing arrangements in the Vedic school on Monday.

Before commencing inspection, the Additional EO reviewed the department wise progress of works for the massive Vedic conference including engineering, electrical, Reception, Annaprasadam, sanitation, floral arrangements etc. Later he inspected the Yagashala site, conference area, and ongoing civil, electrical and other works to be taken up for the big dharmic event.

The Vedic School Principal Sri KSS Avadhani said, the conference will be inaugurated on February 25 at 10: 30am. About 715 students and 115 Vedic scholars from across the country will be taking part in this massive programme. “Exams will be organised from February 26 to 29 for the students in 54 various Vedic departments and those who excel in top two positions will be felicitated on March 1 during the valedictory session with 5gm Gold and 10gm Silver dollars respectively along with certificates”, he added. 

The Principal also said there will be Chaturveda Havanam and Stouta Yagam on all these days between 8am and 12noon. “Apart from this, renowned scholar Brahmasri Madugula Nagaphani Sharma will render religious discourses on Vedam-Srimadramayanam, Vedam-Mahabharatam and Vedam-Srimadbhagavatham on February 27, 28 and 29 respectively”, he maintained.

SE II Sri Nageswara Rao, SE Electrical Sri Venkateswarulu, DyEOs Sri Harindranath, Sri Nagaraja, Sri Balaji, Sri Damodar, Health Officer Dr RR Reddy, Vigilance Officer Sri Manohar and other officers were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

అఖిల‌భార‌త వేదశాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సు ఏర్పాట్ల‌పై అద‌న‌పు ఈవో స‌మీక్ష‌

ఫిబ్ర‌వ‌రి 25 నుండి మార్చి 1వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హ‌ణ‌

దేశం న‌లుమూల‌ల నుండి 715 మంది విద్యార్థులు, 115 మంది అధ్యాప‌కులు రాక‌

ఫిబ్రవరి 17, తిరుమ‌ల‌, 2020: వేద ప‌రిరక్ష‌ణ కార్యక్ర‌మాల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 25 నుండి మార్చి 1వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న 28వ అఖిల‌భార‌త శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సు ఏర్పాట్ల‌పై టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. తిరుమ‌లలోని ధ‌ర్మ‌గిరి ఎస్వీ వేద విజ్ఞాన పీఠంలో ఈ స‌మావేశం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ స‌ద‌స్సును విజ‌య‌వంతం చేసేందుకు అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని సూచించారు. అనంత‌రం సివిల్ ఇంజినీరింగ్ ప‌నులు, ఎల‌క్ట్రిక‌ల్‌, వాట‌ర్‌వ‌ర్క్స్‌, అన్న‌ప్ర‌సాదం, బ‌స‌, వైద్యం, ర‌వాణా, పారిశుద్ధ్యం, పుష్పాలంక‌ర‌ణ‌, భ‌ద్ర‌త త‌దిత‌ర అంశాల‌పై అధికారుల‌తో చ‌ర్చించారు. ఆ త‌రువాత వేద పాఠ‌శాల‌లోని యాగ‌శాల, స‌ద‌స్సు వేదిక ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు.

వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని మాట్లాడుతూ ఫిబ్ర‌వ‌రి 25న ఉద‌యం 10.30 గంట‌ల‌కు స‌ద‌స్సు ప్రారంభమ‌వుతుంద‌ని, దేశం న‌లుమూల‌ల నుండి 715 మంది విద్యార్థులు, 115 మంది అధ్యాప‌కులు పాల్గొంటార‌ని తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 26 నుండి 29వ తేదీ వ‌ర‌కు వివిధ విభాగాల్లో అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని, మార్చి 1న ముగింపు కార్య‌క్ర‌మంలో స‌ర్టిఫికెట్లు ప్ర‌దానం చేస్తామ‌ని వివ‌రించారు. మొత్తం 54 వేద శాఖ‌లకు సంబంధించిన ప‌రీక్ష‌లు జ‌రుగ‌నున్నాయ‌ని, వీటిలో ప్ర‌థ‌మ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికి 5 గ్రాముల బంగారు డాల‌రు, ద్వితీయ శ్రేణిలో నిలిచిన వారికి  10 గ్రాముల వెండి డాల‌రు బ‌హుమానంగా అందిస్తామ‌న్నారు. గ‌తంలో 27 సార్లు శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సులు జ‌రిగాయ‌ని వివ‌రించారు.

ఈ స‌మావేశంలో టిటిడి ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, డెప్యూటీ ఈవోలు శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, శ్రీ బాలాజి, శ్రీ దామోద‌ర్‌, శ్రీ నాగ‌రాజ‌, ఆరోగ్య‌శాఖాధికారి డా. ఆర్ఆర్‌.రెడ్డి, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, క్యాట‌రింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్‌.శాస్త్రి, ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.