ADDITIONAL EO REVIEWS MUSEUM WORKS _ ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులపై అదనపు ఈవో సమీక్ష

TIRUMALA, 12 AUGUST 2025: The Additional EO of TTD Sri Ch Venkaiah Chowdary on Tuesday evening reviewed the status of ongoing development works in the SV Museum.

The meeting took place at Annamayya Bhavan in Tirumala with the officials concerned.

As a part of it, he discussed engineering works including civil and electrical, guides for the museum, security, sanitation and other facilities that are required to be set up in a professional way to make it as a world class state of art museum.

He instructed the officials concerned to complete the works within the scheduled time frame.

Chief Museum Officer in-charge Sri Somannarayana, other officials were also present. 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులపై అదనపు ఈవో సమీక్ష 

తిరుమల, 2025 ఆగస్టు 12: తిరుమలలోని ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనుల పురోగతిపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సివిల్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్ పనులు, మ్యూజియం గైడ్స్, భద్రత, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్ది   ప్రపంచ స్థాయి ఆధునిక మ్యూజియంగా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు.

పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఇన్ ఛార్జ్  చీఫ్ మ్యూజియం ఆఫీసర్ శ్రీ సోమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.