ADDITIONAL EO REVIEWS ON CM’s VISIT_ గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనపై టిటిడి అదనపు ఈవో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి సమీక్ష
Tirumala, 28 Sep. 19: Additional EO Sri AV Dharma Reddy reviewed on the visit of Honourable CM of AP Sri YS Jagan Mohan Reddy to Tirumala on September 30.
The meeting was held at the Conference Hall in Gokulam at Tirumala on Saturday. The SO reviewed on accommodation, darshan, security aspects during the visit of CM on the first day of annual brahmotsavams at Tirumala.
INSPECTION AT VAKULAMATA REST HOUSE
Later the Additional EO inspected the Vakulamata Rest House which is set ready for inauguration by the CM of AP. TTD has constructed a five-storied
Complex with 270 rooms at a cost of Rs.42.86crore. The Additional EO also inspected Swami Pushkarini works.
CE Sri Ramachandra Reddy and other officers were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనపై టిటిడి అదనపు ఈవో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి సమీక్ష
తిరుమల, 2019 సెప్టెంబర్ 28: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన సెప్టెంబర్ 30న ధ్వజారోహణం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ|| శ్రీ వై.ఎస్ జగన్మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారని, ఇందుకోసం అన్ని విభాగాల అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని గోకులం సమావేశ మందిరంలో శనివారం ఉదయం టిటిడి అధికారులతో అదనపు ఈవో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని భద్రతా అధికారులను ఆదేశించారు. శ్రీవారి ఆలయం, రిసెప్షన్, సెక్యూరిటీ, పోలీస్, ఇతర అధికారులు సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.
వకులమతా అతిథి భవంలో అదనపు ఈవో తనిఖీలు
అనంతరం అదనపు ఈవో ముఖ్యమంత్రి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న వకుళమతా అతిథి భవనాన్ని పరిశీలించారు. టిటిడి రూ .42.86 కోట్ల వ్యయంతో 270 గదులతో కూడిన ఐదు అంతస్తులతో అతిథి భవనాన్ని టిటిడి నిర్మించింది. తరువాత అదనపు ఈవో స్వామి పుష్కరిణి పనులను కూడా పరిశీలించారు.
ఈ సమావేశంలో సిఇ శ్రీ రామచంద్రరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.