ADDL EO BRIEFS IAS PROBATIONERS ON TTD_ శిక్ష‌ణ ఐఏఎస్‌లకు టిటిడి కార్యకలాపాలపై అవగాహన

Tirumala, 30 Sep. 19: TTD Additional Executive Officer Sri A V Dharma Reddy said that TTD was both a religious cum welfare institution which is striving for the promotion of harmony and service to society.

Addressing the 12 trainee IAS probationers who are on duty at Tirumala for the Brahmotsavams, he highlighted the heritage, history, glory and service orientation of TTD.

He appraised the officers on the special arrangements made for Brahmotsavams like preparation of food packets, drinking water, crowd management, security, hygiene, health and amenities to common devotees.

The IAS officers each will be stationed at various locations during the Brahmotsavams for on hands experience of situation analysis etc.

GM Transport and IT Chief Sri Sesha Reddy, DyEO temple Sri Harindranath and other senior officials participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

శిక్ష‌ణ ఐఏఎస్‌లకు టిటిడి కార్యకలాపాలపై అవగాహన

 సెప్టెంబర్ 30, తిరుమల 2019: శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల విధుల‌కు విచ్చేసిన 12 మంది శిక్షణ ఐఏఎస్‌లకు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి సోమ‌వారం తిరుమ‌ల‌లోని కార్యాల‌యంలో టిటిడి కార్యకలాపాలపై అవ‌గాహ‌న క‌ల్పించారు.

ఈ సందర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ టిటిడి అమలుచేస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక, విద్య, వైద్య, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌, తాగునీటి వ‌స‌తి క‌ల్పించామ‌ని మెరుగైన పారిశుద్ధ్యం, భ‌ద్ర‌త ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని తెలిపారు. కాగా, శిక్ష‌ణ ఐఏఎస్‌లు బ్ర‌హ్మోత్స‌వాల్లో ప‌లు ప్రాంతాల్లో ఉండి క్షేత్ర‌ప‌రిశీల‌న చేప‌డ‌తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఐటి విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.