ADDNL. EO HOLDS MEETING WITH TIRUMALA SHOP KEEPERS OVER PLASTIC BAN _ ప్లాస్టిక్ నిషేధంపై దుకాణాల నిర్వాహకులతో అదనపు ఈఓ సమావేశం
TIRUMALA, 28 APRIL 2022: TTD Additional EO Sri AV Dharma Reddy on Thursday held a meeting with the shopkeepers over the implementation of the plastic ban as a part of protecting the environs of Tirumala.
The meeting was held in Seva Sadan 2 Hall were in the shopkeepers and hoteliers participated and given their consent to join hands with TTD in its mission to make Tirumala a “Plastic-free Zone”.
Later speaking to media persons, the Additional EO said, the Tirumala shopkeepers have extended commendable cooperation in completely banning the usage of plastic bottles, bags and covers. However, in today’s fifth meeting of its sorts, we have discussed in length on how to ban or find alternative packing for some products that which comes from the manufacturers in plastic covers.
The Additional EO said, even the shopkeepers and hoteliers have put forth their problems pertaining to their shops which were noted and will be resolved soon.
Later he also briefed on the improvements that were brought in the TTD-run SV High School at Tirumala to impart quality education to the children.
SE II Sri Jagadeeshwar Reddy, Health Officer Dr Sridevi, Estates Officer Sri Mallikarjuna, VGO Sri Bali Reddy and other officers were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ప్లాస్టిక్ నిషేధంపై దుకాణాల నిర్వాహకులతో అదనపు ఈఓ సమావేశం
తిరుమల, 2022 ఏప్రిల్ 28: తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం అమలుపై దుకాణదారులతో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి గురువారం సమావేశం నిర్వహించారు. శ్రీవారి సేవా సదన్ – 2లో జరిగిన ఈ సమావేశంలో దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు. తిరుమలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు తాము కూడా సహరిస్తామని తెలిపారు.
అనంతరం అదనపు ఈఓ మీడియాతో ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు తిరుమల దుకాణదారులు సహకరించడం అభినందనీయమన్నారు. ఈరోజు ఐదో సమావేశం నిర్వహించామన్నారు. తయారీదారుల నుండి ప్లాస్టిక్ కవర్లలో వచ్చే కొన్ని ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు తమ సమస్యలను చెప్పుకున్నారని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని అదనపు ఈఓ తెలిపారు. అనంతరం తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్వీ హైస్కూల్‌లో పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు తీసుకొచ్చిన అభివృద్ధిని వివరించారు.
ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ మల్లికార్జున, విజిఓ శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.