ADHYANOTSAVAM TO CONCLUDE ON DEC 31 IN SRIVARI TEMPLE_ డిసెంబ‌రు 31న‌ ముగియనున్న అధ్యయనోత్సవాలు

Tirumala, 26 Dec. 18: The 25 day long prestigious utsav -Adhyayanotsavam- underway at Srivari Temple since December 7, will conclude on December 31.

As part of the unique event the 4000 pasuras of Divya Prabandam penned by the 12 Alwars were chanted at the Ranganayakula mandapam of Srivari temple under the guidance of Sri Vaishnava Jeeyangars on all these days.

The first 11 days of the Adhyayanotsavam is titled as Pagalpathu, next 10 days as Rajpath. The 22 days is Kanniman Thiruthambu, 23rd Day is Ramanuja Matrandadi, 24th day is Sri Varahaswamy Sattumura, and the 25th days is celebrated asThanirmudu festival as concluding event of the Adhyayanotsavam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

డిసెంబ‌రు 31న‌ ముగియనున్న అధ్యయనోత్సవాలు

తిరుమల, 26 డిసెంబ‌రు 2018: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న అధ్య‌య‌నోత్స‌వాలు డిసెంబరు 31వ తేదీన ముగియ‌నున్నాయి. డిసెంబ‌రు 7న ప్రారంభ‌మైన అధ్య‌య‌నోత్స‌వాలు 25 రోజుల పాటు జ‌రుగనున్నాయి.

ఈ సంద‌ర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీ వైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం ద్వారా స్వామివారికి నివేదిస్తున్నారు. ఈ 25 రోజుల్లో ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను శ్రీవైష్ణవులు స్వామివారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పారాయణం చేస్తున్నారు.

కాగా అధ్య‌య‌నోత్స‌వాల్లో తొలి 11 రోజుల‌ను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజుల‌ను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున‌ కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీ వరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున తణ్ణీరముదు ఉత్స‌వంతో ఈ అధ్యయనోత్సవాలు ముగుస్తాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.