ADHYAYANOTSAVAM CONCLUDES AT SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు
Tirumala, 7 Jan. 21: The 25 days long holy Utsava of Adhyayanotsavam conducted at Srivari temple from December 14 onwards concluded on Thursday with the chants of Divya Prasadam at Ranganayakula Mandapam at the Asthanam of Sri Malayappa and his consorts Sridevi and Sri Bhudevi.
On all 25 days the Tirumala Pontiffs, Vaishnava Jeeyarswamis chanted the 4000 pasuras penned by 12 Alwars in the form of Gosti Ganam.
On the last day of Adhyayanotsavam, Thursday, they performed the Tannirmudu Utsavam. A grand Asthanam of Sri Malayappa and his consorts is scheduled on January 8 at the Sri Thirumala Nambi temple in south Mada Street.
GRAND TIRUMALA NAMBI TANNIRMUDU UTSAVA
The Tirumala Nambi Tannirmudu Utsava, of eminent disciple of Lord Venkateshwara, was grandly celebrated on Thursday. After the evening Sahasra Deepalankara seva and asthanam of Sri Malayappa Swamy at vahana Mandapam, the descendants of Tirumala Nambi brought holy water from Akasha Ganga in a procession from Tirumala Nambi temple to vahana Mandapam.
Thereafter the Jeeyar Swamy’s, Archakas and prabandam pundits entered Srivari temple with holy waters and performed Abhisekam to Srivari feet with with holy water followed by Parayanam of Tirumoli Pasuras.
Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy, descendants of Tirumala Nambi Sri Krishnaswamy Tatacharyulu and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు
తిరుమల, 2021 జనవరి 07: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 14వ తేదీ నుండి 25 రోజుల పాటు జరిగిన అధ్యయనోత్సవాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టి నిర్వహించారు.
గత 25 రోజులుగా శ్రీవారి ఆలయంలో శ్రీవైష్ణవ జీయంగార్లు 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం ద్వారా ప్రతి రోజు స్వామివారికి నివేదించారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను పారాయణం చేశారు.
గురువారంనాడు అధ్యయనోత్సవాల్లో చివరిరోజు కావడంతో ”తన్నీరముదు” ఉత్సవం నిర్వహించారు. అధ్యయనోత్సవాలు ముగిసిన అనంతరం మరుసటిరోజు అనగా జనవరి 8న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు దక్షిణ మాడ వీధిలోని శ్రీ తిరుమలనంబి ఆలయానికి వేంచేస్తారు.
ఘనంగా ”తిరుమలనంబి తన్నీరముదు” ఉత్సవం
శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీవేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడైన శ్రీ తిరుమలనంబి స్మృత్యర్థం ప్రతి ఏడాదీ నిర్వహించే ”తన్నీరముదు” ఉత్సవం తిరుమలలో గురువారం నాడు ఘనంగా జరిగింది. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధి ఆలయ ప్రదక్షిణముగా వాహన మండపానికి వేంచేపు చేస్తారు. తిరుమలనంబి ఆలయం నుండి వీధి ప్రదక్షిణంగా తిరుమలనంబి వంశీకులు శిరస్సుపై బిందెలతో ఆకాశగంగ తీర్థాన్ని వాహన మండపానికి తీసుతీసుకొచ్చారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణ నడుమ జీయర్ స్వాములు, ఆచార్య పురుషులు, ప్రబంధ పండితులు పవిత్ర తీర్థజలంతో ఆలయంలోకి వేంచేపు చేశారు.
అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి మూలవిరాట్టు పాదాలపై అమరి ఉన్న బంగారు తొడుగునకు పవిత్ర ఆకాశగంగ జలంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తిరుమల నంబి రచించిన ”తిరుమొళి పాశురాలను” పారాయణం చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, తిరుమలనంబి వంశీయులు శ్రీ కృష్ణస్వామి తాతాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.