ADHYAYANOTSAVAMS COMMENCES IN TIRUMALA TEMPLE _ శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం

Tirumala, 12 December 2023: The 25-day lengthiest festival among 450 odd festivals that are being observed in Tirumala, the Adhyayanotsavams commenced on a grand religious note in Tirumala temple on Tuesday evening at Ranganayakula Mandapam.

During this period the Nalayira Divyaprabandha Pasura Parayanam will be rendered by Jeeyangars.

It usually starts 11 days before Vaikuntha Ekadasi in Dhanurmasam and the first 11 days are called Pagalpattu and the remaining 10 days are called Rapattu.  On the 22nd day Kanninun Shiruthambu, on the 23rd day Ramanuja Nutrandadi, on the 24th day Sri Varahaswami Sattumora and on the 25th day the festival concludes.

Tirumala pontiffs, TTD top brass officials, temple staff participated in the event.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం

తిరుమల, 2023 డిసెంబరు 12: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25 రోజుల పాటు జ‌రుగ‌నున్న అధ్యయనోత్సవాలు మంగ‌ళ‌వారం ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు రంగ‌నాయ‌కుల మండ‌పంలో అధ్య‌య‌నోత్స‌వ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జియ్యంగార్లు గోష్ఠిగానం చేస్తారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు.

కాగా, తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.

తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్‌‌స్వామి, తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్‌‌స్వామి, టిటిడి అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.