ADHYAYANOTSAVAMS COMMENCES IN TIRUMALA TEMPLE _ శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం
Tirumala, 7 Dec. 2018: The annual Adhyayanotsavams commenced in Sri Tirumala temple on Friday and will conclude on December 31.
This 25 day festival will commence eleven days prior to Vaikuntha Ekadasi festival. Rendition of Nalayira Divya Prabandha Pasura Parayanam penned by 12 Alwars during these days is the importance associated with this festival.
The first eleven days are known as Pagalpattu, the next ten days Rapattu while on 22nd day Kanninun Siruttambu, 23rd day Ramanuja Nutrandadi, 24th day Sri Varahaswamy Sattumora will be observed and on the last day Tanniramudu festival will be observed.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం
డిసెంబరు 07, తిరుమల, 2018: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాత్రి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టి నిర్వహిస్తారు. సాధారణంగా వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ అధ్యయనంగా పిలిచే ఈ అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. డిసెంబరు 31వ తేదీ వరకు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా శ్రీవైష్ణవ జీయంగార్లు స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్టిగానం చేస్తారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు.
కాగా, తొలి 11 రోజులను పగల్పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని పిలుస్తారు. 22వ రోజున కణ్ణినున్ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున తణ్ణీరముదు ఉత్సవంతో అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.