ADHYAYANOTSAVAMS TO COMMENCE FROM DEC 26 ONWARDS _ శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం

Tirumala, 26 Dec. 19: The annual 25-day festival of Adhyayanotsavams, will commence in Tirumala temple from Thursday evening onwards.

Usually this fete will be observed 11 days prior to Vaikuntha Ekadasi. As the Vaikuntha Ekadasi is scheduled on January 6, the Adhyayanotsavams will commence on December 26 and conclude on January 19.

The first 11 days are known as Pagalpattu and next 10 days are called Rapattu while on the 22 day Kanninun Siruttambu,  23 day Sri Ramanuja Nootrandadi, 24 day Sri Varaha swamy Sattumora and on 25 day, the festival of Adhyayanotsavams concludes with Tanniramudu fete.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం

డిసెంబరు 26, తిరుమల, 2019: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25 రోజుల పాటు జ‌రుగ‌నున్న అధ్యయనోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు రంగ‌నాయ‌కుల మండ‌పంలో అధ్య‌య‌నోత్స‌వ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తారు.  ధనుర్మాసంలో  వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు.

కాగా, తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.