ADHYAYANOTSAVAMS TO CONCLUDE ON JANUARY 7 _ జ‌న‌వ‌రి 7న‌ ముగియనున్న అధ్యయనోత్సవాలు

Tirumala, 5 Jan. 21: The 25-day festival of Adhyayanotsavams will conclude on January 7 in Tirumala.

This annual festival commenced on December 14 last.  Everyday Nalayira Divya Prabandha Pasura Parayanam written by 12 Alwars, will be recited by the Jiyar Swamis in Tirumala temple.

The first 11 days are known as Pagalpathu and the next 10 days are known as Rapathu. 

On 22nd day, Kanninun Siruttambu, 23rd day Ramanuja Nootrandadi, 24th day Sri Varahaswamy Sattumora and on 25th day Tanniramudu utsavam will be observed with which the festival concludes.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

జ‌న‌వ‌రి 7న‌ ముగియనున్న అధ్యయనోత్సవాలు

తిరుమల, 2021 జ‌న‌వ‌రి 05: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న అధ్య‌య‌నోత్స‌వాలు జ‌న‌వ‌రి 7వ తేదీ గురువారం ముగియ‌నున్నాయి. గ‌త ఏడాది డిసెంబ‌రు 14న ప్రారంభ‌మైన అధ్య‌య‌నోత్స‌వాలు 25 రోజుల పాటు జ‌రుగుతాయి.

ఈ సంద‌ర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీ వైష్ణవ జీయంగార్లు ప్ర‌తి రోజు గోష్ఠిగానం ద్వారా స్వామివారికి నివేదిస్తున్నారు. ఈ 25 రోజుల్లో ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని  4 వేల పాశురాలను శ్రీవైష్ణవులు స్వామివారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పారాయణం చేస్తున్నారు.

కాగా అధ్య‌య‌నోత్స‌వాల్లో తొలి 11 రోజుల‌ను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజుల‌ను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున‌ కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీ వరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున తణ్ణీరముదు ఉత్స‌వంతో ఈ అధ్యయనోత్సవాలు ముగుస్తాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.