ADHYAYANOTSAVAMS TO CONCLUDE _ జ‌న‌వ‌రి 5న‌ ముగియనున్న అధ్యయనోత్సవాలు

TIRUMALA, 04 JANUARY 2023: The 25-day lengthiest festival among the series of festivals being observed in Tirumala, the Adhyayanotsavams will conclude in Srivari temple on January 5.

 

The festival commenced 11 days ahead of Vaikuntha Ekadasi on December 12.

The first eleven days are called Pagalpattu and the next ten days Rapattu. On the 22nd day Kanninun Shiruthambu, on the 23rd day Ramanuja Nutrandadi were observed.

 

On the 24th day on Wednesday, Sri Varahaswami Sattumora was observed as a part of the festival.

 

The 25 day festival concludes on Thursday.

 

Tirumala pontiffs, TTD  officials, temple staff participate in the event.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జ‌న‌వ‌రి 5న‌ ముగియనున్న అధ్యయనోత్సవాలు

తిరుమల, 2024 జ‌న‌వ‌రి 04: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న అధ్య‌య‌నోత్స‌వాలు జ‌న‌వ‌రి 5వ తేదీ శుక్ర‌వారం ముగియ‌నున్నాయి. గ‌త ఏడాది డిసెంబర్ 12న వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందుగా ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

ఈ సంద‌ర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీ వైష్ణవ జీయంగార్లు ప్ర‌తి రోజు గోష్ఠిగానం ద్వారా స్వామివారికి నివేదిస్తున్నారు. ఈ 25 రోజుల్లో ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను శ్రీవైష్ణవులు స్వామివారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పారాయణం చేస్తున్నారు.

అధ్య‌య‌నోత్స‌వాల్లో తొలి 11 రోజుల‌ను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజుల‌ను రాపత్తు అని వ్యవహరిస్తారు. కాగా, 22వ రోజున‌ కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది జ‌రిగాయి.
24వ రోజైన గురువారం శ్రీ వరాహస్వామివారి ఆల‌యంలో సాత్తుమొర నిర్వ‌హించారు. 25వ రోజైన శుక్ర‌వారం తణ్ణీరముదు ఉత్స‌వంతో ఈ అధ్యయనోత్సవాలు ముగుస్తాయి.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.