ADI PARVA PARAYANAMS ENDS AT NADA NEERAJANAM _ నాదనీరాజనంపై ముగిసిన ఆదిపర్వం పారాయణం
* SABHA PARVA PARAYANAMS FROM JUNE 1
Tirumala, 31 May 2022: The parayanams of Adi Parva of Mahabharata organised by TTD at the Nada Niranjanam platform seeking Srivari blessings for the well-being of humanity concluded on Tuesday night.
The TTD EO Sri AV Dharma Reddy participated in the program and the final shlokas of the last sarga were chanted between 8.00-9.00 pm by Archayas KV Seshacharya and Sri Satya Kishore of Dharmagiri Veda vijnan peetham.
The parayanams of Adi Parva began on May 8 of 2021 and lasted 13 months wherein 9000 shlokas of all 234 sargas were chanted with the narration of meaning by the pundits.
Thereafter TTD EO felicitated the acharyas Sri KV Seshacharya and Sri Satya Kishore
The parayanams of Sabha Parva is slated to commence on June 1, tomorrow at the same venue and also the same time slot.
SVBC CEO Sri Suresh Kumar, Acharya Sri K V Sharma of national Sanskrit University, Tirupati and other pundits were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నాదనీరాజనంపై ముగిసిన ఆదిపర్వం పారాయణం
జూన్ 1 నుంచి సభాపర్వం
తిరుమల, 2022 మే 31: శ్రీవారి అనుగ్రహంతో సృష్టిలోని సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ టిటిడి ప్రారంభించిన మహాభారతం ప్రవచనాల్లో భాగంగా నాదనీరాజనం వేదికపై జరుగుతున్న ఆదిపర్వం పారాయణం మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు. రాత్రి 8 నుండి 9 గంటల వరకు చివరి ఘట్టంలోని శ్లోకాలను తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు శ్రీ కె.వి.శేషాచార్యులు, శ్రీ సత్య కిషోర్ పారాయణం చేశారు.
2021 మే 8న ఆదిపర్వం పారాయణం ప్రారంభమైంది. దాదాపు 13 నెలల పాటు ఆదిపర్వంలోనీ 234 అధ్యాయాల్లో గల 9 వేల శ్లోకాలను అర్థతాత్పర్యాలతో పండితులు పారాయణం చేశారు. ఈ సందర్భంగా శ్లోకపారాయణం చేసిన శ్రీ కె.వి.శేషాచార్యులు, శ్రీ సత్య కిషోర్ ను ఈఓ సన్మానించారు.
కాగా, జూన్ 1వ తేదీ బుధవారం నుంచి సభాపర్వం ప్రవచనం ప్రారంభంకానుంది.
ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈఓ శ్రీ సురేష్ కుమార్, తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య కుప్పా విశ్వనాథ శర్మ పలువురు పండితులు పాల్గొన్నారు
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.