ADI SHANKARACHARYA FETE ON NOVEMBER 5 _ నవంబరు 5న శ్రీనివాసమంగాపురం, ఒంటిమిట్టలో ఆదిశంకరా చార్య వేడుకలు
TIRUPATI, 04 NOVEMBER 2021: In connection with the opening ceremony of Jagatguru Sri Adi Shankaracharya Samadhi by Honourable Prime Minister of India Shri Narendra Modi at Uttarakhand on November 5, special programs are mulled by TTD at Srinivasa Mangapuram and Vontimitta.
Sri Adi Shankaracharya has roamed the entire country and preached Advaita Siddhanta by establishing various mutts in the four corners of the country.
Special devotional programs have been arranged in all the places where Sri Adi Shankaracharya set his step.
These programs will be observed in Srinivasa Mangapuram and also at Vontimitta by TTD from 7 a.m. onwards on November 5.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరు 5న శ్రీనివాసమంగాపురం, ఒంటిమిట్టలో ఆదిశంకరా చార్య వేడుకలు
తిరుపతి 04 నవంబరు 2021: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ పుణ్య క్షేత్రంలో పునర్నిర్మించిన శ్రీ ఆది శంకరాచార్య సమాధిని ప్రధాని శ్రీ నరేంద్రమోదీ నవంబరు 5 వ తేదీ శుక్రవారం ప్రారంభించనున్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా శ్రీ ఆది శంకరాచార్యుల వారు నడయాడిన ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి శ్రీనివాసమంగాపురం, ఒంటిమిట్ట లో టీటీడీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది