‌”ADIBHATLA IMMORTALISED HARIKATHA”-KALATAPASVI Dr K VISWANATH _ హరికథకు ప్రాణం పోసిన ఆదిభట్ట : శ్రీ కాశీనాధుని విశ్వనాథ్‌

TIRUPATI, SEPTEMBER 4:  Multi-dimensionalpersonality and Father of Harikatha Parayanam, Sri Ajjada Adibhatla Narayanadasa, has immortalised the Harikatha Parayana with his proficiency andcontributed a lot to the various genres of art and literature said versatile Telugu Film Director, Padmasri, Kalatapasvi Dr K Viswanath.
 
Addressing on the occasion of 149th Birth Anniversary celebrations of the versatile Harikatha personality in Sri Venkateswara College ofMusic and Dance in Tirupati on Wednesday, the legendary Telugu Film director said, Sri Adibhatla has pioneered Harikatha which is onlyunique to Telugu literature. He called upon the students to take the spirit of the greatest contributions done by Sri Adibhatla and enliventhe art of Harikatha.
 
“I am fortunate to be inivited to take part in this great programme today. I have a great passion for traditional art and literature. I always emphasised on the same in my films also. You can also see some character with Harikatha background in most of my films, since Iregard Harikatha as one of the major media of arts to depict our rich tradition and culture in the society”, he added.
 
Later TTD EO Sri MG Gopal said, the life history of the great scholar is an encyclopedia to the students. “Sri Adibhatla not only a versatile Harikatha artist but also an author, musician and academician of great repute”, EO maintained.
 
Adding further the EO said, Sri Adibhatla spread the essence of Hindu Sanatana Dharma values embedded in Hindu scriptures and puranas to remote villages with this Harikatha. “Today, it is indeed a memorable occasion that the live stature of Sri Adibhatla has been unveiled in the college campus by versatile Telugu Film Director, Padmasri Dr Kasinathuni Viswanath. As Adibhatla spread Hindu dharma with his Harikatha, Sri Viswanath has done a great contribution by spreading the message to the youth with his films which portrayed culture and traditional arts in a big way and made him unique director from others”, he maintained.
  
Earlier the live statue of Sri Ajjada Adibhatla Narayanadasa has been unveiled in a ceremonious way. Sri Vishwanath and TTD EO Sri MG Gopal also felicitated the sculptor Sri Akella Satya Maruthi Rao on this occasion.
  
Tirumala JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri GVG Ashok Kumar, GM Sri Sesha Reddy, College Principal Smt C Prabhavathi, Head of Harikatha Department Sri Simhachalashastry were also present.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 

హరికథకు ప్రాణం పోసిన ఆదిభట్ట : శ్రీ కాశీనాధుని విశ్వనాథ్‌

తిరుపతి, సెప్టెంబరు 04, 2013: సంగీతం, సాహిత్యం, నృత్యం లాంటి సంప్రదాయకళల మేళవింపుతో హరికథకు ప్రాణం పోసిన మహనీయుడు శ్రీ ఆదిభట్ట నారాయణదాసవర్యులు అని ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకులు శ్రీ కాశీనాధుని విశ్వనాథ్‌ అన్నారు. హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ట నారాయణదాసవర్యుల 149వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన శిలావిగ్రహావిష్కరణ కార్యక్రమం బుధవారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో ఘనంగా జరిగింది. శ్రీ విశ్వనాథ్‌ ముఖ్య అతిథిగా హాజరై నారాయణదాసవర్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిభట్ట వారు హరికథల ద్వారా భక్తి సాహిత్యాన్ని, హైందవ ధర్మాన్ని విస్తృతంగా వ్యాప్తి చేశారని, సంగీత కళాశాల విద్యార్థులు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని అడుగుజాడల్లో పడవాలని సూచించారు. సంప్రదాయ కళలంటే తనకు ఎంతో భక్తి, ఇష్టమని, శ్రీ వేంకటేశ్వరుని పాదాల చెంత జరిగే కార్యక్రమాలకు ఎన్నిసార్లు పిలిచినా కాదనకుండా వచ్చేస్తానని అన్నారు. తిరుపతి నగరానికి అద్వితీయమైన ఆకర్షణ ఉందని, అందునా ఎస్వీ సంగీత కళాశాల ప్రాంగణంలో అడుగడుగునా సప్తస్వరాలు మారుమోగుతుంటాయని పేర్కొన్నారు. ఆదిభట్ట లాంటి మహనీయుడి దర్శనం జీవితంలో కాలేదన్న బాధ ఆయన విగ్రహావిష్కరణ ద్వారా తీరిందన్నారు. సంప్రదాయ కళల్లో ఉన్న గొప్పదనాన్ని ప్రతి చిత్రంలోనూ తనకు చేతనైన రీతిలో చూపానని తెలిపారు. ముఖ్యంగా తన  తొలిచిత్రం ‘ఓ సీత కథ’లో ముఖ్య పాత్ర హరికథ నేపథ్యంలోనే సాగుతుందన్నారు. ఇక్కడ నెలకొల్పిన ఆదిభట్ట వారి సజీవ విగ్రహం ఆయన నిజంగానే హరికథ చెబుతున్న దివ్యానుభూతిని కలిగిస్తోందన్నారు.

తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్‌ మాట్లాడుతూ నారాయణదాసవర్యులను నడిచే విశ్వవిద్యాలయంగా అభివర్ణించారు. విశ్వనాథ వారు తమ చలనచిత్రాల ద్వారా సంప్రదాయ కళలు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను చాటి చెప్పారని వివరించారు. అందుకే విశ్వనాథ చేతులమీదుగా ఆదిభట్ట విగ్రహావిష్కరణ చేయించినట్టు తెలిపారు. ఆదిభట్ట వారు తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో ఎవ్వరూ అందుకోలేని స్థానానికి చేరుకున్నారని వివరించారు. సంగీత కళాశాలలోని హరికథ విభాగం అభివృద్ధికి తితిదే తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఈవో తెలిపారు.

అంతకుముందు తితిదే ముద్రించిన ”శ్రీనివాస కల్యాణం” అనే హరికథ గ్రంథాన్ని శ్రీ విశ్వనాథ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వనాథ్‌ను శాలువ, శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటంతో ఈవో సన్మానించారు. సన్మానం అందుకున్న వారిలో ఆదిభట్ట విగ్రహాన్ని రూపొందించిన శిల్పి శ్రీ ఆకెళ్ల సత్యమారుతిరావు, ఈవో, జెఈవో ఉన్నారు.

ఈ కార్యక్రమంలో తితిదే తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, విద్యాశాఖ అధికారి శ్రీ శేషారెడ్డి, సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి చల్లా ప్రభావతి, హరికథా విభాగాధిపతి శ్రీ సింహాచలశాస్త్రి, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
              
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది