ADISESHA CARRIES PARAMAPADANADHA ON FIRST DAY OF BRAHMOTSAVAMS _ పెద్ద‌శేష వాహ‌నంపై ప‌ర‌మ‌ప‌ద‌నాథుని అలంకారంలో శ్రీ మ‌ల‌యప్ప‌స్వామి

Tirumala, 19 Sep. 20: The processional deity of Sri Malayappa Swamy took celestial ride on the seven hooded mighty Pedda Sesha Vahana in Paramapadanadha Avatara on the first day evening on Saturday.

In view of COVID 19 restrictions, TTD has dispensed with procession of vahanam along four mada streets and conducted Vahana seva within the temple complex at Kalyanotsava Mandapam in Ekantam.

Sri Malayappa Swamy flanked by His two consorts Sridevi and Bhudevi on Pedda Sesha Vahanam blessed millions and millions of devotees across the world on the celestial occasion as SVBC telecasted the live programme of entire vahana seva.

TTD Trust board chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, board members Sri Ananta, Sri Siva Kumar, Sri Kumaraguru, Sri Sekhar Reddy, Additional EO Sri A V Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Urban SP Sri Ramesh Reddy, Srivari temple Sri Harindranath were also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

పెద్ద‌శేష వాహ‌నంపై ప‌ర‌మ‌ప‌ద‌నాథుని అలంకారంలో శ్రీ మ‌ల‌యప్ప‌స్వామి

 సెప్టెంబర్ 19, తిరుమల 2020: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో మొద‌టిరోజు శ‌ని‌వారం రాత్రి 8.30 నుండి 9.30 గంట‌ల వ‌రకు శ్రీ‌వారి ఆల‌యంలో పెద్ద‌శేష వాహ‌న సేవ జ‌రిగింది.

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) ప‌ర‌మ‌ప‌ద‌నాథుని అలంకారంలో అనుగ్ర‌హించారు. అనంత‌శ్చ అస్మి నాగానాం… స‌ర్పానాం అస్మి వాసుకిః… తాను నాగుల‌లో శేషుడిని, స‌ర్పాల‌లో వాసుకిని అని సాక్షాత్తు ప‌ర‌మాత్మ చెప్పిన‌ట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆదిశేషుడు త‌న శిర‌స్సుపై స‌మ‌స్త భూభారాన్ని మోస్తుంటారు. ఆదిశేషుడు శ్రీహరికి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి  అత్యంత సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. స్వామివారికి పానుపుగా, దిండుగా, పాదుక‌లుగా, ఛ‌త్రంగా, వాహ‌నంగా శేషుడు సేవ చేస్తుంటాడు. శేషుడిని ద‌ర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.
       
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు స‌భ్యులు శ్రీ డిపి.అనంత‌, శ్రీ శివ‌కుమార్‌, శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల