AKHANDA PARAYANAMS ON DECEMBER 23 AT TIRUMALA _ డిసెంబ‌రు 23న తిరుమ‌ల‌లో భ‌గ‌వ‌ద్గీత, శ్రీ విష్ణు సహస్రనామ అఖండ పారాయ‌ణం

Tirumala,14 December 2023: As part of Vaikunta Ekadasi and Gita Jayanti festivities on December 23, TTD is organising Sampurna Bhagavad Gita Akhanda Parayanam and Sri Vishnu Sahasranama Parayanam at Nada Niranjanam platform in Tirumala on that day.

The Parayanams of 700 shlokas from Bhagavad Gita will be held at 12 noon in the afternoon followed by Sri Vishnu Sahasranama Parayanam from 6 pm onwards.

Faculty of SV Vedic University, Dharmagiri Veda Vignana Peetham and SV Institute of Higher Vedic Studies besides TTD Vedic pundits and Sri Annamacharya project artists and devotees will participate.

The SVBC channel will live telecast the programme for the benefit of Srivari devotees across the world.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డిసెంబ‌రు 23న తిరుమ‌ల‌లో భ‌గ‌వ‌ద్గీత, శ్రీ విష్ణు సహస్రనామ అఖండ పారాయ‌ణం

తిరుమ‌ల‌, 2023 డిసెంబ‌రు14: డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాద‌శి మ‌రియు గీతా జ‌యంతిని పుర‌స్క‌రించుకొని తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై సంపూర్ణ భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయ‌ణం నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుండి భ‌గ‌వ‌ద్గీత‌లోని 18 ఆధ్యాయాల్లో 700 శ్లోకాలు నిరంత‌రాయంగా పారాయ‌ణం చేస్తారు. సాయంత్రం 6 గంట‌ల నుండి శ్రీ విష్ణు సహస్రనామ పారాయ‌ణం నిర్వ‌హిస్తారు.

అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంకు చెందిన శాస్త్రీయ పండితులు, టీటీడీ వేదపండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ క‌ళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ఈ పారాయ‌ణ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.